ACT OF SERIOUS MISCHIEF-ADDITIONAL EO _ తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారు

TTD ACTS ON PORTALS HURTING DEVOTEE SENTIMENTS

Tirumala, 28 Dec. 20: Taking a serious note on the baseless social media report about “Cross” mark on Tirumala temple, TTD Additional EO Sri AV Dharma Reddy said a case has has been registered on the social media portal and the miscreants and appealed to devotees not to fall prey to such baseless reports. He asserted TTD is committed for the promotion of Hindu Sanatana Dharma and this is an act by some vested interests to defame the reputation of TTD.

Speaking in front of Tirumala temple on Monday evening, he said a case has been registered against the Facebook URL page- Talapatranidhi- which had mischievously morphed the electric decorative figure of Kalasha on Srivari temple outer walls into a Christian Cross.

He said during all festivals various electrical decorations including lord Hanuman, Garuda, Tirunamam and Purna Kalasha delight the religious sentiments of the visiting pilgrims in the illumination.

The devotees also expressed serious anguish and dismay over these baseless reports on TTD by the social media portal and a section of media.

Additional EO also warned that such miscreants and their intentional and vituperative acts to defame the Tirumala Divya Kshetra, the abode of Lord Venkateswara will not be tolerated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారు

– తాళ పత్ర నిధి ఫేస్ బుక్ URL, ఇతరులపై పై పోలీసు కేసు

– అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి

 తిరుమల 28 డిసెంబరు 2020: తిరుమల ఆలయం మీద విష ప్రచారం చేయడం ద్వారా ఆలయ పవిత్రతను దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని టీటీడీ అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ హిందూ ధర్మ వ్యాప్తికి కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న కృషి భక్తులందరికీ తెలుసన్నారు.తిరుమల శ్రీవారి ఆలయం ముందు సోమవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు.

తిరుమల శ్రీవారి ఆలయ ప్రాకారంపై పూర్ణ కలశ ఆకారంలో ఉన్న విద్యుత్ అలంకరణను శిలువగా మార్ఫింగ్ చేసి తాళ పత్ర నిధి Facebook URL తో పాటు మరికొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారన్నారు..

శ్రీవారి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు హనుమంత, గరుడ, పూర్ణకుంభ అలంకరణలు చేయడం కొన్ని దశాబ్దాలుగా వస్తోందన్నారు. పవిత్రమైన కళశంను శిలువ గా మార్ఫింగ్ చేసి కుట్ర పూరితంగా దుష్ప్రచారం చేశారని ఆయన చెప్పారు. 

ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందనీ, కోట్లాదిమంది భక్తుల్లో ఆందోళన రేకెత్తించిందన్నారు. ఈ పోస్ట్ పెట్టిన తాళ పత్ర నిధి Facebook URL , ఇతరులపై పోలీసు కేసు నమోదు చేశామన్నారు.

హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుమల క్షేత్రం పై తరచూ కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు.
తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే వారిని ఉపేక్షించబోమనీ, ఇలాంటి వారిపై టీటీడీ చట్ట పరంగా చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా శ్రీ ధర్మారెడ్డి మీడియా, భక్తులకు సదరు కలశం విద్యుత్ అలంకరణను చూపించారు. చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, ఎస్ ఈ శ్రీ నాగేశ్వరరావు, ఆలయ డిప్యూటి ఈవో శ్రీ హరీంద్ర నాథ్, ఆలయ ఓఎస్డీ శ్రీ పాల శేషాద్రి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

అది శిలువ కాదు : భక్తులు

శ్రీ వారి ఆలయ ప్రాకారం మీద ఏర్పాటు చేసిన పూర్ణ కుంభం లో పువ్వు లాగా విద్యుత్ అలంకరణ చేశారని, అది శిలువ కాదని పలువురు భక్తులు ప్రత్యక్షంగా చూసి స్పష్టం చేశారు. పూర్ణకుంభం ను మార్ఫింగ్ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని వారు చెప్పారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే వారిని ఉపేక్షించ వద్దని పలువురు భక్తులు టీటీడీకి సూచించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది