ADDITIONAL EO INSPECTS SHOPS IN TIRUMALA _ తిరుమలలో అడిషనల్ ఈవో తనిఖీలు
Tirumala, 25 November 2024: The TTD Additional EO Sri Ch Venkaiah Chowdary conducted surprise inspections at the shopping complex on Monday.
As a part of it he directed to remove encroachments on the shops without any inconvenience to the movement of devotees.
He said that cleanliness should be maintained around the shops.
Later, the parking lot at the back of HT shopping complex was also inspected by the Additional EO.
Later he inspected Ram Bhagicha and observed the distribution of Annaprasadam at the Food Counter near the bus stand.
TTD Deputy EO Smt. Asha Jyoti, Health Officer Sri. Madhusudhana Prasad and others participated in this inspection.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో అడిషనల్ ఈవో తనిఖీలు
తిరుమల, 2024 నవంబరు 25: తిరుమలలోని హెచ్.టి. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి సోమవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. దుకాణాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దుకాణాల ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. దుకాణ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని చెప్పారు. అనంతరం హెచ్.టి.షాపింగ్ కాంప్లెక్స్ వెనుకవైపు ఉన్న పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. రామ్ భగిచా బస్టాండ్ వద్ద ఉన్న అన్న ప్రసాద పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీమతి ఆశాజ్యోతి, హెల్త్ ఆఫీసర్ శ్రీ మధుసూదనప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.