ADDITIONAL EO INSPECTS VQC _ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అదనపు ఈవో తనిఖీలు
TIRUMALA, 19 SEPTEMBER 2024: As a part of his every day surprise inspections to check the amenities being provided by TTD reaching the pilgrims waiting in the queue lines and compartments, the TTD Additional EO Sri Ch Venkaiah Chowdhary on Thursday inspected the Vaikuntham compartments.
As a part of his inspection he observed the time table of different Annaprasadams and beverages being served to pilgrims at different intervals and also notified the releasing time of compartments and made a few suggestions to the on duty staff.
Temple DyEO Sri Lokanatham, VGO Sri Surendra, AEOs Sri Srihari, Sri Munirathnam, AVSO Sri Manohar were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అదనపు ఈవో తనిఖీలు
తిరుమల, 2024 సెప్టెంబరు 19: తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించేందుకు తన ప్రతిరోజు ఆకస్మిక తనిఖీల్లో భాగంగా టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గురువారం వైకుంఠం కంపార్ట్‌మెంట్లను పరిశీలించారు.
ఇందులో భాగంగా, యాత్రికులకు వివిధ సమయాల్లో అందజేస్తున్న అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందించే నిర్దేశిత సమయాలను పరిశీలించారు. అదేవిధంగా కంపార్ట్‌మెంట్ల విడుదల సమయాన్ని పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ తనిఖీల్లో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, విజివో శ్రీ సురేంద్ర, ఏఈఓలు శ్రీ శ్రీహరి, శ్రీ మునిరత్నం, ఏవీఎస్‌వో శ్రీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.