ADDITIONAL EO, JEO INSPECTS GALLERIES _ గ్యాలరీలలో అన్నప్రసాదాల పంపిణీని పరిశీలించిన అదనపు ఈవో, జేఈవో
Tirumala, 03 February 2025: The Additional EO Sri Ch Venkaiah Chowdary along with JEO Sri V Veerabraham inspected the distribution of Annaprasadam to the devotees, who entered the galleries on Monday night on the occasion of Rathasaptami.
Upma, milk and fresh water were provided to the devotees on Monday night.
Around 200 devotees joined each gallery and they expressed their joy over the German sheds and other facilities that were set up.
Additional EO and JEO went to each gallery and inquired about the facilities provided to the devotees.
On this occasion, concerned officials were directed to keep toilets clean and pay special attention to sanitation.
Officers and staff have been advised to be more responsible and vigilant during vehicle services.
TTD Deputy EO Sri. Lokanatham, officials of various departments participated in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గ్యాలరీలలో అన్నప్రసాదాల పంపిణీని పరిశీలించిన అదనపు ఈవో, జేఈవో
తిరుమల, 2025, ఫిబ్రవరి 03: రథసప్తమి సందర్భంగా సోమవారం రాత్రి గ్యాలరీలలోకి చేరిన భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల పంపిణీని అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వి వీరబ్రహ్మం పరిశీలించారు.
ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి గ్యాలరీలలోకి చేరిన భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి భక్తులకు ఉప్మా, పాలు, మంచినీరు అందించారు. ప్రతి గ్యాలరీలో సరాసరి సోమవారం రాత్రి సమయానికి 200మంది భక్తులు చేరారు. చలికాలంలో మంచుకు ఇబ్బంది లేకుండా వేసిన జర్మన్ షెడ్లు, తదితర సౌకర్యాలపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి గ్యాలరీలోకి అదనపు ఈవో, జేఈవో వెళ్లి అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రథసప్తమి రోజున క్రమం తప్పకుండా గ్యాలరీలలోని భక్తులకు ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఇవ్వకుండా అన్నప్రసాదాలు, తాగునీరు , పాలు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
వాహన సేవల సమయంలో మరింత బాధ్యతాయుతంగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు, సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ ఎం.రాజేంద్ర కుమార్, వీజీవోలు శ్రీ ఎన్ టి వి రామ్ కుమార్, శ్రీ ఎ.సురేంద్ర, సతీష్ కుమార్ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది