ADDITIONAL EO REVIEWS ON RADHASAPTHAMI _ రథసప్తమి ఏర్పాట్లపై అదనపు ఈవో సమీక్ష
TIRUMALA, 28 FEBRUARY 2025: In connection with the ensuing annual Radhasapthami on February 04, the Additional EO Sri Ch Venkaiah Chowdary held a review meeting on Tuesday at Annamaiah Bhavan in Tirumala.
Along with JEO Sri Veerabrahmam, CVSO I/c Sri Manikantha, he reviewed in detail on the ongoing arrangements, especially on security and crowd management aspects.
He asked various departmental officials of TTD, vigilance – security and police to make coordinated arrangements and focus on Risk Assessment Preparedness, Systematic Organization to prevent overcrowding, Traffic and Parking Arrangements, Emergency Response Team.
He also asked them to make a comprehensive Bundobust plan, monitor ghat road vehicular movement, better execution and evacuation planning in the case of emergency and directed everyone to make communication seamless.
Besides he also reviewed Annaprasadam, Sanitation, Srivari Sevaks, medical teams, LED screens and other arrangements.
Earlier he also reviewed the issuance of tokens at Srivari Mettu with the officials concerned.
District Collector Sri Venkateswar, SP Sri Harshavardhan Raju also participated in the meeting virtually.
CE Sri Satyanarayana, Tirumala Additional SP Sri Ramakrishna, GM IT Sri Sesha Reddy, temple DyEO Sri Lokanatham and other HoDs were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
రథసప్తమి ఏర్పాట్లపై అదనపు ఈవో సమీక్ష
జనవరి 28, 2025: ఫిబ్రవరి 04న తిరుమలలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
టిటిడి జేఈఓ శ్రీ వి.వీరబ్రహ్మం, సివిఎస్వో ఇంఛార్జి శ్రీ మణికంఠ చందోలుతో కలిసి భద్రత, జన రద్దీ నిర్వహణ, తదితర అంశాలపై సమీక్షించారు.
టిటిడి వివిధ విభాగ అధికారులు, విజిలెన్స్- సెక్యూరిటీ మరియు పోలీసులతో సమన్వయం చేసుకుని ముందస్తుగా జన రద్దీని అంచనాలు వేసుకుని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని అదనపు ఈవో సూచించారు. ట్రాఫిక్, పార్కింగ్ , అత్యవసర టీమ్స్ లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
సమగ్ర బందోబస్త్ పై ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, ఘాట్ రోడ్డు వాహనాల కదలికను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అత్యవసర పరిస్థితుల్లో తరలించేలించేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసేలా సమన్వయం చేసుకోవాలని ఆయన ఆదేశించారు.
అన్నప్రసాదం, పారిశుద్ధ్యం , శ్రీవారి సేవకులు, వైద్య బృందాలు, ఎల్ ఈ డీ స్క్రీన్లు మరియు ఇతర ఏర్పాట్లపై సమీక్షించారు.
అంతకు మునుపు ఆయన శ్రీవారి మెట్టు టోకెన్లు పై కూడా సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్, ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు లు వర్చువల్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సీఈ శ్రీ సత్యనారాయణ, తిరుమల అదనపు SP శ్రీ రామకృష్ణ, GM IT శ్రీ శేషారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం మరియు ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేసినది