ADDITIONAL EO SURPRISE INSPECTIONS _ అడిషనల్ ఈవో ఆకస్మిక తనిఖీలు

Tirumala, 08 November 2024: The Additional EO of Tirumala Sri Ch. Venkaiah Chowdary conducted a surprise inspection in the Narayanagiri Sheds during the wee hours on Friday. 

As a part his inspection, he verified by interacting with the devotees whether the pilgrims were receiving food and milk on time. 

He also observed the services being provided by the Srivari Sevaks to the devotees. 

Since it is winter, he instructed the officials to provide hot milk continuously and also directed the concerned to ensure that adequate medical facilities are available to devotees.

He instructed the officials to take appropriate steps to ensure that the devotees waiting at Vaikuntha Queue Complex-2 have a speedy darshan by reducing waiting hours to the maximum possible extent.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అడిషనల్ ఈవో ఆకస్మిక తనిఖీలు

తిరుమల, 2024 నవంబరు 08: తిరుమల అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి నారాయణ గిరి షెడ్లను శుక్రవారం వేకువజామున ఆకస్మిక తనిఖీ చేశారు. యాత్రికులకు భోజన, పాలు సకాలంలో అందుతున్నాయా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి సేవకులు భక్తులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. చలికాలం కావడంతో వేడి పాలు నిరంతరాయంగా అందజేయాలని అధికారులను ఆదేశించారు.

తగిన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేటట్లుగా చూడాలన్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్-2లో వేచి ఉన్న భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం చేయిండానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.