ADDITIONAL SPACE FOR PARKING FOR G-DAY-SPECIAL OFFICER_ భక్తులకు సంతృప్తి కలిగించేలా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు : తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి
Tirumala, 12 Sep. 19: To ensure hassle-free parking facility for vehicles in Tirumala, TTD is getting ready with additional parking arrangements for the upcoming big religious event, Srivari annual brahmotsavams in the Outer Ring Road area, said Tirumala Special Officer Sri AV Dharma Reddy.
With just a few days to go for annual brahmotsavams in Tirumala, Tirumala Special Officer has held a high-level meeting on security arrangements to be made during the ensuing annual brahmotsavams with a special focus on the day of Garuda Seva with CVSO Sri Gopinath Jatti and Tirupati Urban SP Sri Anburajan at Gokulam Conference Hall on Thursday.
During the review meeting, the SO urged the TTD Vigilance sleuths and Police personnel to make elaborate arrangements in providing security cover to pilgrims and paying extra attention in all the entry and exit points at galleries especially on Garuda Seva Day.
With respect to parking facilities, the SO instructed the concerned to identify the parking places with specific numbering to facilitate pilgrims to reach their vehicles without any inconvenience after Garuda Seva. He also instructed to guide the pilgrims on parking places by forming a Guiding group who have enough knowledge about these parking areas and their route maps. He also directed to see the possibility of plying shuttle vehicles to transport aged and differently able pilgrims to reach these parking areas safely. “Continuous announcements through Public Address System should be given to inform the pilgrims”, he added.
CVSO said this year special focus is laid on luggage counters keeping in view the previous year’s experience. “Since this year, the Garuda Seva crowd is coupled with Third Peratasi Saturday on the immediate day, we are anticipating more crowd than last year and making arrangements to meet the pilgrim demand”, he maintained.
Tirupati Urban SP said, three circuitous routes have been identified as Tirpati, Ghat Road and Tirumala to avoid any inconvenience to pilgrim public on Garuda Seva Day.
Chief Engineer Sri Ramachandra Reddy, GM Transport Sri Sesha Reddy, RTC RM Sri Chengal Reddy, Additional CVSO Sri Venkata Siva Reddy, ASP Sri Maheswara Raju and other officers from Vigilance, police etc. took part in the meeting.
INSPECTION IN TIRUMALA:
Later, the SO inspected, Bedi Anjaneya Swamy, the four mada streets, W1 gate, Pushkarini etc. and directed the officials concerned to make necessary barricading and also regulation of pilgrim crowd into galleries during brahmotsavams. CVSO, Tirupati Urban SP and other officers were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
భక్తులకు సంతృప్తి కలిగించేలా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు : తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి
తిరుమల, 2019 సెప్టెంబరు 12: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు సంతృప్తి కలిగించేలా ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల తిరుమల ప్రత్యేకాధికారి, అధికారులతో కలిసి గురువారం ఉదయం తనిఖీ చేశారు.
బేడి ఆంజనేయస్వామివారి ఆలయం నుండి భక్తులు గ్యాలరీల్లోకి చేరుకునే మార్గాన్ని పరిశీలించారు. మాడ వీధుల్లోని ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను పరిశీలించారు. విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులు మాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. భద్రతపరంగా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బ్రహ్మోత్సవాలకు విశేషసంఖ్యలో వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్యాలరీలలోకి ప్రవేశించేందుకు, తిరిగి వెలుపలికి వచ్చేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలలో ఉదయం, రాత్రి వాహనసేవలతో పాటు, అక్టోబరు 4వ తేదీ జరుగనున్న గరుడసేవలో కూడా భక్తులు సంతృప్తి కరంగా శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా గరుడసేవ మరునాడు పెరటాశి నెల 3వ శనివారం సందర్బంగా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున, అందుకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. భక్తులకు దాదాపు 8 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు.
అనంతరం తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీ అన్బురాజన్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టామని, దాదాపు 4,700 మంది భద్రాత సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 585 సిసి కెమెరాలు ఉండగా, అదనంగా 1051 కెమెరాలను ఏర్పాటు చేసి రెండు కామన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నట్లు వివరించారు.
అంతకుముందు గోకులం విశ్రాంతి గృహంలోని సమావేశ మందిరంలో ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి ఇంజినీరింగ్, రవాణా, పోలీస్, ఆర్‌టిసి అధికారులతో దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘంగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించారు. ఇందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డులో మరో 1200 వాహనాలు పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాలన్నారు. తిరుమలలోని పార్కింగ్ ప్రాంతాలు మరియు వారి రూట్ మ్యాప్‌ల గురించి అవగాహన ఉన్న ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తద్వారా యాత్రికులు సులభంగా పార్కింగ్ స్థలాలకు చేరుకుంటారన్నారు. అదేవిధంగా భక్తులు సురక్షితంగా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, అత్యవసర గేట్లు తదితర అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు.
ప్రత్యేకాధికారి వెంట టిటిడి సివిఏస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, ఏఎస్‌పి శ్రీ మహేశ్వర రాజు, సిఇ శ్రీ రామచంద్రారెడ్డి, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీ చెంగల్ రెడ్డి, రవాణా విభాగాదిపతి శ్రీ శేషారెడ్డి, ఎస్ఇ (ఎలక్ట్రికల్) శ్రీ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు ఉన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.