ANKURARPANAM HELD_ నారాయ‌ణ‌వ‌నంలో ప‌విత్రోత్స‌వాలకు అంకురార్ప‌ణ‌

Tirupati, 12 Sep. 19: Ankurarpanam was held in Narayanavanam temple on the occasion of Annual one day Pavitrotsavams on Thursday.

The pavitotsavam will be observed on September 13.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నారాయ‌ణ‌వ‌నంలో ప‌విత్రోత్స‌వాలకు అంకురార్ప‌ణ‌

సెప్టెంబరు 12, తిరుపతి, 2019: టిటిడికి అనుబంధంగా ఉన్న‌ నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆల‌యంలో పవిత్రోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని గురువారం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా ఉదయం ఆచార్య ఋత్విక్‌వరణం, సాయంత్రం మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం, యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.

సెప్టెంబరు 13న ఒకరోజు పవిత్రోత్సవంలో భాగంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. ఇందులోభాగంగా ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మ‌వారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, ఆ తరువాత పవిత్ర సమర్పణ చేప‌డ‌తారు. సాయంత్రం తిరువీధి ఉత్సవం, యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి నిర్వ‌హిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.