ADHARWANA VEDA PARAYANAM COMMENCES _ రంగ‌నాయ‌కుల మండ‌పంలో అధ‌ర్వ‌ణ వేద‌పారాయ‌ణం ప్రారంభం

Tirupati, 25 Jun. 21: Adharwana Veda Parayanam commenced at Ranganayakula Mandapam in Tirumala on Friday under the aegis of SV Higher Vedic Studies.

As part of the rendition of Chaturveda Veda Parayanam which has commenced on April 13 last year, TTD has been continuing this spiritual program to ward off the ill effects of the Covid virus.

According to the Project Coordinator Dr A Vibhishana Sharma, there are 1132 Sakhas in all four Vedas. So far the Sakhas from Rig, Yajur and Sama Veda Sakhas were completed.

Today we have commenced Sounaka Sakha in Adharwana Veda. There are many Visuchika Nivarana Mantras embedded in Adharwana Veda. Reciting these Mantras will provide relief to humanity from dreadful diseases and viruses, he explained.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

రంగ‌నాయ‌కుల మండ‌పంలో అధ‌ర్వ‌ణ వేద‌పారాయ‌ణం ప్రారంభం

తిరుమల‌, 2021 జూన్ 25: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో శుక్ర‌వారం అధ‌ర్వ‌ణ వేద‌పారాయ‌ణం ప్రారంభ‌మైంది. ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణశ‌ర్మ పర్యవేక్షణలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ఉత్త‌రాంధ్ర ప్రాంతం నుండి 10 మంది నిష్ణాతులైన వేద పండితులు పాల్గొని పారాయ‌ణం చేశారు.

లోక క్షేమం కోసం క‌రోనా వ్యాధిని మాన‌వాళికి దూరం చేయాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ 2020, ఏప్రిల్ 13 నుండి టిటిడి చ‌తుర్వేద పారాయ‌ణం నిర్వ‌హిస్తోంది. మొత్తం నాలుగు వేదాల్లో 1132 శాఖ‌లున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు రుగ్వేదం, య‌జుర్వేదం, సామ‌వేదంలోని శాఖ‌లు పూర్త‌య్యాయి. ప్ర‌స్తుతం అధ‌ర్వ‌ణ వేదంలోని శౌన‌క శాఖ పారాయ‌ణం ప్రారంభ‌మైంది.

ఈ సంద‌ర్భంగా వేద పండితులు మాట్లాడుతూ వేదాల్లో మాన‌వాళికి ఉప‌యోగ‌ప‌డే అనంత‌మైన ర‌హ‌స్యాలు దాగి ఉన్నాయ‌న్నారు. మాన‌వుల‌ను బాధ‌పెట్టే క‌రోనా లాంటి వ్యాధుల‌ను నివారించేందుకు క్రిమివినాశ‌క మంత్రాలు అధ‌ర్వ‌ణ వేదంలో ఉన్నాయ‌ని తెలిపారు. ఈ మంత్ర పారాయ‌ణం ద్వారా వ్యాధుల నుండి ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌న్నారు. య‌జ్ఞ‌యాగాది క్ర‌తువుల్లో జ‌రిగిన లోపాలను స‌రిచేసేందుకు అధ‌ర్వ‌ణ వేదమంత్రాలు ఉప‌క‌రిస్తాయ‌ని చెప్పారు. వేద‌పారాయ‌ణం చేసినా, విన్నా, చూసినా స‌క‌ల‌శ్రేయ‌స్సు క‌లుగుతుంద‌ని వివ‌రించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.