GOVARDHANA GIRIDHARI SHINES ON SURYAPRABHA VAHANAM _ సూర్యప్రభపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు
Tirupati, 25 Jun. 21: The Seventh-day morning witnessed Sri Prasanna Venkateswara riding Suryaprabha vahanam as Govardhanagiridhari during the ongoing annual brahmotsavams at Appalayagunta.
The vahana Seva took place in Ekantam due to Covid norms.
Temple DyEO Smt Kasturi Bai, Temple Chief Priest and Kankana Bhattar Sri Surya Kumar Acharyulu, AEO Sri Prabhakar Reddy, Superintendent Sri Gopalakrishna Reddy were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
సూర్యప్రభపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు
తిరుపతి, 2021 జూన్ 25: అప్పలాయగుంట శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శుక్రవారం ఉదయం స్వామివారు గోవర్థనగిరిధారి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై కటాక్షించారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహించారు.
సూర్యుడు తేజోనిధి, సకలరోగ నివారకుడు, ప్రకృతికి చైతన్యప్రధాత. వర్షాలు, వాటివల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఔషధాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభను అధిష్టించిన స్వామిని దర్శించడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు మరియు కంకణబట్టార్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ గోపాల కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.