ADHYAYANOTSAVAM AT SRIVARI TEMPLE FROM DEC 26 TO JAN 10 _ డిసెంబరు 26 నుంచి జ‌న‌వ‌రి 19వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు

Tirumala, 22 Dec. 19: TTD is conducting Adhyayanotsavam, a recital of Pasuras of Alwar Divya Prabandham, 11 days ahead of Vaikunta Ekadasi, from December 26-January 19 at the Srivari Temple as part of the Dhanur Masam utsavams.

As part of the unique ritual, the Srivaishana Jeeyangars will conduct Gosti ganam (Parayanam) of the 4000 Divya Prabandha pasuras scripted by 12 Alwars, for 25 days at the Ranganayakula mandapam of Srivari Temple.

As per traditions first 11 days are labelled as Pagalpattu and the next 10 days as Rapattu and remaining four days -22nd day – Kanniman Shirathambu, 23rd day as Ramanuja Nutrandadi, 24th day as Sri Varahaswami Sattumura, and 25th day as Andhyayanotsavam.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

 

 

డిసెంబరు 26 నుంచి జ‌న‌వ‌రి 19వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు

 డిసెంబరు 22, తిరుమల, 2019: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 26 నుండి 2020, జ‌న‌వ‌రి 19వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. సాధారణంగా ధనుర్మాసంలో  వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ అధ్యయనంగా పిలిచే ఈ అధ్యయనోత్సవం ప్రారంభమవుతుంది.

ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం చేస్తారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు.

కాగా, తొలి 11 రోజులను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున కణ్ణినున్‌ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి సాత్తుమొర, 25వ రోజున అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.