SRI PAT WILL BE CLOSED FROM DEC 25 MIDNIGHT TILL DEC 26 1.30PM _ డిసెంబరు 26న మ‌ధ్యాహ్నం వ‌ర‌కు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌య త‌లుపులు మూత‌

Tirupati, 22 Dec. 19: In view of the Solar eclipse he Sri Padmavati Ammavari Temple of Tiruchanoor will open up for darshan for devotees only at .30 noon of December 26.

The unique solar eclipse will occur this year from morning 8.08 am to 11.16 am on December 26. As a result, the temple of Goddess Padmavati will remain shut from midnight of December 25 after ekantha Seva and open up for devotee’s darshan at 1.30pm only after, Shuddi, Punya havachanam, suprabatham, sahasra namarchana, and Nitya Archana rituals.

The TTD has also cancelled VIP break Dashan, suprabatham, Archana, Tiruppavada, Kalyanotsavam sevas on December 26.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

డిసెంబరు 26న మ‌ధ్యాహ్నం వ‌ర‌కు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌య త‌లుపులు మూత‌

డిసెంబరు 22, తిరుప‌తి, 2019: సూర్య‌గ్ర‌హ‌ణం కార‌ణంగా డిసెంబ‌రు 26వ తేదీ గురువారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు తిరుచానూరులోని  శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల నుండి అమ్మ‌వారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు.

డిసెంబ‌రు 26న ఉద‌యం 8.08 గంట‌ల నుండి ఉద‌యం 11.16 గంట‌ల వ‌ర‌కు సూర్య‌గ్ర‌హ‌ణం ఉంటుంది. ఈ కార‌ణంగా డిసెంబ‌రు 25న బుధ‌వారం రాత్రి ఏకాంత సేవ అనంత‌రం ఆల‌య త‌లుపులు మూస్తారు. తిరిగి  డిసెంబ‌రు 26న గురువారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఆల‌య తలుపులు తెరుస్తారు. శుద్ధి, పుణ్య‌హ‌వ‌చ‌నం అనంత‌రం ఏకాంతంగా సుప్ర‌భాతం, స‌హ‌స్ర‌నామార్చ‌న, నిత్యార్చ‌న చేప‌డ‌తారు. మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల నుండి భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

సూర్య‌గ్ర‌హ‌ణం కార‌ణంగా డిసెంబ‌రు 26వ తేదీ ఉద‌యం, సాయంత్రం బ్రేక్ ద‌ర్శ‌నాల‌తోపాటు సుప్ర‌భాతం, అర్చ‌న‌, తిరుప్పావ‌డ, క‌ల్యాణోత్స‌వం ఆర్జిత సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది. భ‌క్తులు ఈ విష‌యాల‌ను గ‌మ‌నించ‌గ‌ల‌ర‌ని కోర‌డ‌మైన‌ది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.