ADIBHATLA IS A SOCIAL REFORMER _ శ్రీ ఆదిభట్ల నారాయణదాస సాహితీ ప్రతిభ అపూర్వం : ఆచార్య కె.సర్వోత్తమరావు

Tirupati, 07 September 2018: Sri Maddjada Adibhatla Narayana Dasu was undoubtedly a social reformer who taught the morals to a common man through his style of Hari katha Parayanam, said scholars.

During 154th Birth Anniversary of the Hari katha Pitamaha, a special lecture programme was organised in Mahati Auditorium in Tirupati on Friday.

Prof. K Sarvottama Rao in his address described Sri Adibhatla as a multilingual exponent.Smt G Sridevi, a telugu scholar also presented her paper on Hari katha Vaibhavam.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ ఆదిభట్ల నారాయణదాస సాహితీ ప్రతిభ అపూర్వం : ఆచార్య కె.సర్వోత్తమరావు

సెప్టెంబరు 07, తిరుపతి 2018;శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాస సాహితీ ప్రతిభ అపూర్వమైనదని ఎస్వీయు విశ్రాంతాచార్యులు ఆచార్య కె.సర్వోత్తమరావు పేర్కొన్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరుగుతున్న శ్రీ నారాయణదాస 154వ జయంతి ఉత్సవాలు శుక్రవారం రెండో రోజుకు చేరాయి.

ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ఆచార్య కె.సర్వోత్తమరావు మాట్లాడుతూ శ్రీ నారాయణదాసును అపర నారదునిగా అభివర్ణించారు. ఈయన సంగీత, సాహిత్యాల్లో బాల్యం నుంచే అద్భుతమైన ప్రతిభాపాఠవాలు ప్రదర్శించేవారన్నారు. పోతన భాగవత పద్యాలు, ఇతర శతక పద్యాలను ఐదేళ్ల ప్రాయంలోనే అవలీలగా వళ్లించేవారని చెప్పారు. ఈయన రచించిన సావిత్రిచరిత్ర, జానకీశపథం, భక్తమార్కండేయ చరిత్ర, రుక్మిణీ కల్యాణం హరికథా వాఙ్మయంలో నాలుగు వేదాలు లాంటివని తెలియజేశారు.

అనంతరం తిరుపతికి చెందిన తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షురాలు శ్రీమతి గంగవరం శ్రీదేవి ”హరికథా వైభవం” అనే అంశంపై పత్ర సమర్పణ చేశారు. ఆ తరువాత తిరుపతికి చెందిన శ్రీ కె.చంద్రశేఖర్‌ భాగవతులు ”గజేంద్రమోక్షం” హరికథా గానం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి వైవిఎస్‌.పద్మావతి, అధ్యాపకులు శ్రీ వేంకటేశ్వర్లు ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.