JEO INSPECTS BRAHMOTSAVAM ARRANGEMENTS_ తిరుమలలో జెఈవో విస్తృత తనిఖీలు
VIDEO WALL AND CCTV s TO VIGIL BTUs
Tirumala, 7 September 2018: As a part of enhanced security measure, Video Wall and CCTVs were installed in Tirumala, said Tirumala JEO Sri KS Sreenivasa Raju.
During his inspection in Tirumala on Friday evening, the JEO visited Video Wall set up in Common Command Center at a cost of Rs.1.60crores. He said 283 CC cameras have also been installed at a cost of Rs.5.6crores in mada streets and srivari temple. These advanced security apparatus will help to vigil brahmotsavams and other such events in a better way.
Later he inspected Mada streets, outer ring road, permanent toilets etc. along with CVSO incharge Sri Siva Kumar Reddy, SE 2 Sri Ramachandra Reddy and other officers were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో జెఈవో విస్తృత తనిఖీలు
సెప్టెంబరు 07, తిరుమల 2018: టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు శుక్రవారం తిరుమలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా పిఏసి-4లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించారు.
అనంతరం జెఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల భద్రతే ధ్యేయంగా ఇక్కడ ఒక కోటి 60 లక్షల రూపాయల వ్యయంతో అత్యాధునిక వీడియోవాల్‌ను ఏర్పాటుచేశామన్నారు. అదేవిధంగా రూ.5.60 కోట్లతో శ్రీవారి ఆలయం, మాడ వీధుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 283 సిసి కెమెరాలు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. ఇక్కడ విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణలో 30 మంది సిబ్బంది పని చేస్తున్నారని చెప్పారు. బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి తదితర పర్వదినాల రద్దీ రోజుల్లో తప్పిపోయిన భక్తులను గుర్తించేందుకు, విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రణాళికలను రూపొందించేందుకు ఈ వీడియోవాల్ చక్కగా ఉపయోగపడుతుందన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో నాలుగు కంపార్ట్‌మెంట్లను విమానాశ్రయాల భద్రతా వ్యవస్థ తరహాలో అభివృద్ధి చేశామన్నారు. ఇక్కడ భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే అనుమతిస్తున్నట్టు తెలిపారు.
అనంతరం ఆలయ మాడ వీధులు, ఔటర్ రింగ్ రోడ్డు, మరుగుదొడ్ల నిర్మాణ పనులను జెఇఓ పరిశీలించారు.
జెఇఓ వెంట ఇన్ చార్జి సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, ఎస్ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.