ADIKRITTIKA OBSERVED _ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో వేడుకగా ఆడికృత్తిక

TIRUPATI, 09 AUGUST 2023: The auspicious Adi Krittika fete was observed with religious fervour in Sri Kapileswara Swamy temple on Wednesday in Tirupati.

Sri Valli Devasena sameta Sri Subrahmanya Swamy was offered Snapana Tirumanjanam on the occasion. Later in the evening, Tiruveedhi Utsavam will be observed.

DyEO Sri Devendra Babu, AEO Sri Subba Raju, Superintendent Sri Bhupati and others, large number of devotees have participated.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో వేడుకగా ఆడికృత్తిక

తిరుపతి, 2023 ఆగస్టు 09: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం ఆడికృత్తిక పర్వదినం వేడుకగా జరిగింది.

ఈ సందర్భంగా ఉదయం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. మధ్యాహ్నం మూలవర్లకు అభిషేకం చేపడతారు. సాయంత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.