ADMISSION TO TTD VEDA PATHASHALAS EXTENDED UP TO SEPTEMBER 15 _ సెప్టెంబ‌ర్ 15వ తేదీ వ‌ర‌కు టిటిడి వేద పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గ‌డువు పొడిగింపు

Tirumala, 02 September 2021: TTD has extended the last date to applying for admissions into its Veda pathashalas for the academic year 2021-22 up to September 15.

They include admissions in all six SV Veda patashalas at Veda Vijnana Peetham, Dharmagiri, Keesaragutta, Kesar Mandal, RR District, Telangana, I Bhimavaram of Akiveedu Mandal, Godavari, Vizianagaram, Nalgonda, Kottappakonda, Guntur district.

TTD has invited applications from eligible candidates who have completed traditional thread ceremony and relevant educational qualifications to apply before September 15.

Details of courses and other terms of Vedic education in the above Veda Pathashalas can be seen in the TTD website www.tirumala.org.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబ‌ర్ 15వ తేదీ వ‌ర‌కు టిటిడి వేద పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గ‌డువు పొడిగింపు

తిరుమ‌ల‌, 2021 సెప్టెంబ‌ర్ 02: 2021 -22 విద్యాసంవత్సరానికి గాను టిటిడి వేద పాఠశాలలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకునే గ‌డువు సెప్టెంబ‌ర్ 15వ తేదీ వ‌ర‌కు పొడిగించడం జరిగింది.

టిటిడి ఆధ్వర్యంలో నడపబడుచున్న శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాలలు 1. వేద విజ్ఞాన పీఠం, ధర్మగిరి, తిరుమల 2. కీసరగుట్ట, కీసర మండలం, రంగారెడ్డి జిల్లా 3. ఐ. భీమవరం, ఆకివీడు మండలం, పశ్చిమగోదావరి జిల్లా 4. విజయనగరం, 5. నల్గొండ, 6. కోటప్పకొండ, గుంటూరు జిల్లాల నందు వేద పాఠశాలలు ఉన్నాయి.

ఈ పాఠశాలలో వివిధ కోర్సులలో ప్రవేశం కొరకు అర్హులైన బాలుర నుండి టిటిడి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వైదిక సాంప్రదాయం ప్రకారం ఉపనయనం కాబడి మరియు నిర్ణీత వయస్సు మరియు విద్యా ప్రమాణాలు కలిగిన వారు ఇందుకు అర్హులు. 2021, సెప్టెంబ‌ర్‌ 15వ తేది లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పైన తెలిపిన పాఠశాలలో వివిధ కోర్సుల వివరాలు, అర్హత మరియు దరఖాస్తు ఫారం ఇతర వివరాలకు www.tirumala.org టిటిడి వెబ్‌సైట్‌లను సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.