AGAMA ADVISORY MEETING HELD IN TIRUMALA_ టిటిడి ఆగమ సలహా మండలి సమావేశం
Tirumala, 16 Feb. 19: Vaikhanasa Agama Advisory meeting was held at Annamaiah Bhavan in Tirumala on Saturday.
The five member Agama advisors comprising Sri NAK Sunderavadanachrayulu, Sri A Venugopala Deekshitulu, Sri NV Mohanarangacharyulu, Sri AT Anantasayana Deekshitulu and Sri PSSR Jagannadhacharyulu took part in this meeting.
They thanked TTD EO Sri Anil Kumar Singhal and Tirumala JEO Sri KS Sreenivasa Raju for successfully conducting Astabandhana Balalaya Mahasamprokshanam in the month of August last. They made some suggestions to the TTD mandarins in the meeting. Some excerpts:
@ To publish a book on the entire procedure and process in which Astabandhanam was performed in Srivari temple so that it will act as a guide to other temples in future
@ Since Marichi Vimanarchana Kalpam, the guide to all rituals is in Devanagari script, it is to be translated in to Telugu
@ Construction of Radha Mandapam in Tirumala
@ Astabandhana Balalaya Maha Samprokshanam of Sri Varahaswamy temple from April 22 till April 27.
Bokkasam In-charge Sri Gururaja Rao, Temple OSD Sri P Seshadri were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
టిటిడి ఆగమ సలహా మండలి సమావేశం
తిరుమల, 16 ఫిబ్రవరి 2019: తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ అధ్యక్షతన ఆగమ సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జెఈవో శ్రీకెఎస్.శ్రీనివాసరాజు, టిటిడి వైఖానస ఆగమ సలహాదారులు శ్రీఎన్‌ఎకె.సుందరవదనాచార్యులు, శ్రీ ఎ.వేణుగోపాలదీక్షితులు, శ్రీ ఎన్‌వి.మోహనరంగాచార్యులు, శ్రీ ఎటి.అనంత దీక్షితులు, శ్రీపిఎస్‌ఎస్‌ఆర్.జగన్నాథాచార్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆగమ సలహాదారులు పలు సూచనలు చేశారు.
– తిరుమల శ్రీవారి ఆలయంలో 2018, ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు జరిగిన అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ఘట్టాన్ని గ్రంథస్తం చేయడం. వైఖానస ఆగమాన్ని పాటించే ఇతర ఆలయాలకు ఉపయోగపడేలా దేవనాగరి లిపి నుండి తెలుగులోకి అనువదించడం.
– శ్రీవారి పుష్కరిణి వద్ద రథమండపం నిర్మించడం.
– తిరుమలలోని శ్రీ వరాహస్వామివారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాకుంభాభిషేకాన్ని ఏప్రిల్ 22 నుండి 27వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తారు.
ఈ సమావేశంలో శ్రీవారి ఆలయ ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, బొక్కసం బాధ్యులు శ్రీగురురాజారావు తదితరులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.