JEO INSPECTS APPALAYAGUNTA TEMPLE_ అప్పలాయగుంట శ్రీప్రసన్నవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మరింత అభివృది చేస్తాం -టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
Tirupati, 16 Feb. 19: Tirupati JEO Sri B Lakshmikantham inspected Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta on Saturday.
As a part of it he had seen the arrangements of queue lines, prasadam counters, akhilandam etc. He said, more publicity will be given on the historical and mythological importance of the temple through various media.
Earlier on his arrival he was accorded traditional welcome by the archakas and received by temple DyEO Smt Jhansi Rani. After darshan of the main deity, he also visited Sri Padmavathi Devi and Sri Andal sub temples also.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
అప్పలాయగుంట శ్రీప్రసన్నవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మరింత అభివృది చేస్తాం -టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
తిరుపతి, 2019 ఫిబ్రవరి 16: టిటిడి అనుబంధ ఆలయమైన అప్పలాయగుంట శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని తిరుపతి జెఈవో శ్రీ బి. లక్ష్మీకాంతం తెలిపారు. ఈ ఆలయాన్ని శనివారం ఉదయం జెఈవో సందర్శించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి అనుబంధ ఆలయాల ప్రాచశ్యం, వాటి చరిత్రను ప్రసారమాధ్యమాల ద్వారా మరింత విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. ఆలయాల అభివృద్ధికి, భక్తులకు కావాల్సిన సౌకర్యాలపై మరింతగా ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. అనంతరం జెఈవో ఆలయంలోని క్యూలైన్లు, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.
అంతకుముందు శ్రీ ప్రసన్నవేంకటేశ్వర స్వామి ఆలయానికి జెఈవో దంపతులు రాగానే డిప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం ఉపఆలయాలలోని శ్రీపద్మావతి అమ్మవారిని, శ్రీఆండాళ్ అమ్మవారిని దర్శించారు.
ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్, ఆలయ ప్రధాన ఆర్చకులు శ్రీసూర్యకుమార్ ఆచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.