AGASTEESHWARALAYA ANNUAL FETE _ ఏప్రిల్ 25 నుండి మే 4 వ తేదీ వరకు నారాయణవనం శ్రీ అగస్తీశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

TIRUPATI, 19 APRIL 2023: The annual brahmotsavams of Sri Agasteeshwara Swamy temple at Narayanavanam will be observed between April 25 to May 4.

Ganapati Utsavam and Ankurarpanam will take place on April 24 and Dhwajarohanam on April 25 at the auspicious Mithuna Lagnam.

Nandi Vahanam will be observed on April 29 while Rathotsavam on May 1 and Kalyanotsavam on May 2. The Grihastas have to pay Rs.500 per ticket on which two persons will be allowed.

Tirula Snanam will be observed on May 4 at Kailasa Kona. The Siva Lingam here is believed to have been consecrated by Sage Agastheeswara and hence the name.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

ఏప్రిల్ 25 నుండి మే 4 వ తేదీ వరకు నారాయణవనం శ్రీ అగస్తీశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2023 ఏప్రిల్ 19: నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మరగదవల్లి సమేత అగస్తీశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 25 నుండి మే 4 వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. ఏప్రిల్‌ 24వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు గణపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తారు.

ఏప్రిల్‌ 25వ తేదీ ఉదయం 9 నుండి 10.39 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. అదేరోజు రాత్రి 7 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై అగస్తీశ్వరస్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రతిరోజు ఉదయం 10 నుండి 11 గంటల మధ్య స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. ప్రతి రోజు రాత్రి 7 గంటలకు స్వామివారి వాహనసేవ జరుగుతుంది.

ఏప్రిల్‌ 26వ తేదీ సింహ వాహనం, ఏప్రిల్‌ 27న హంస వాహనం, ఏప్రిల్‌ 28న శేషవాహనం, ఏప్రిల్‌ 29న నంది వాహనం, ఏప్రిల్‌ 30న గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. మే 1న రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. మే 2న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు కల్యాణోత్సవం, అనంతరం అశ్వవాహన సేవ జరుగనున్నాయి. రూ.500/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదాలను బహుమానంగా అందజేస్తారు.

మే 3న ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు శ్రీ నటరాజస్వామివారి వీధి ఉత్సవం జరుగనుంది. సాయంత్రం రావణాసుర వాహనంపై అగస్తీశ్వరస్వామి దర్శనమిస్తారు. మే 4న కైలాసకోనలో త్రిశూలస్నానం ఘనంగా నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు కోలాటం, ఆధ్యాత్మిక, భక్తిసంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

నారాయణవనం ప్రాంతాన్ని పరిపాలించిన శ్రీ పద్మావతీదేవి తండ్రి అయిన శ్రీ ఆకాశ మహారాజు పితామహులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ శ్రీ అగస్తీశ్వరస్వామివారు స్వయంభువుగా వెలిశారు. స్వామివారి లింగాకారానికి పీఠభాగం అమర్చి వేద ఆగమశాస్త్ర ప్రకారం
శ్రీ అగస్త్య మహర్షులవారు ప్రతిష్ఠ చేసి పూజించినందువల్ల స్వామివారికి అగస్తీశ్వరస్వామి అని పేరు వచ్చింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.