AICC CHIEF OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE_ శ్రీవారిని దర్శించుకున్న ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ రాహుల్‌గాంధీ
Tirumala, 22 Feb. 19: The President of All India Congress Committee (AICC) Sri Rahul Gandhi offered prayers in the temple of Lord Venkateswara at Tirumala on Friday.
The Congress Party Chief along with his entourage entered the temple through Vaikuntham Queue Complex and had darshanam of Lord Venkateswara in Mahalaghu like any other common pilgrim in Tirumala temple.
After darshanam of Lord, he was rendered Vedasirvachanam in Ranganayakula Mandapam by Vedic pundits.
Later Tirumala JEO Sri KS Sreenivasa Raju, IAS offered him Theertha prasadams and laminated photo of Lord Venkateswara.
Former CM of United Andhra Pradesh Sri N Kiran Kumar Reddy, Former CM of Kerala Sri Uman Chandy and others were also present.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
శ్రీవారిని దర్శించుకున్న ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ రాహుల్‌గాంధీ
తిరుమల, 22 ఫిబ్రవరి 2019: అఖిలభారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసిసి) అధ్యక్షుడు శ్రీ రాహుల్‌గాంధీ శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీ రాహుల్ గాంధీ తన బృందంతో కలిసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ప్రవేశించి సాధారణ భక్తుల తరహాలో మహాలఘు దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, ఐఏఎస్ శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని శ్రీ రాహుల్ గాంధీకి అందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ముఖమంత్రి శ్రీ నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి, కేరళ మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఉమెన్ చాంది, టిటిడి మాజీ ఛైర్మన్లు శ్రీ టి.సుబ్బరామిరెడ్డి, శ్రీ కనుమూరి బాపిరాజు, టిటిడి సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.