JEO INSPECTS SEVA SADAN BUILDINGS_ నూతన శ్రీవారిసేవ భవన సముదాయాలను తనిఖీ చేసిన జెఇఓ
Tirumala, 22 Feb. 19: Tirumala JEO Sri KS Sreenivasa Raju on Friday evening inspected the newly constructed twin seva aadan buildings.
The JEO instructed the Engineering officials to keep a wicket gate to prevent the entry of private vehicular movements. He also directed to do beautification of drain present in between two sadans.
Later he complimented all the officials for bringing out two massive buildings for sevakulu in a convenient manner.
SE 2 Sri Ramachandra Reddy, PRO Dr T Ravi, EEs Sri Subrahmanyam, Sri Mallikarjuna Prasad were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
నూతన శ్రీవారిసేవ భవన సముదాయాలను తనిఖీ చేసిన జెఇఓ
తిరుమల, 22 ఫిబ్రవరి 2019: తిరుమలలో నూతన శ్రీవారిసేవ భవన సముదాయాలను శుక్రవారం సాయంత్రం టిటిడి తిరుమల జెఇఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, ఐఏఎస్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జెఈఓ శ్రీవారిసేవకులతో మాట్లాడుతూ ఇక్కడ మహిళలకు, పురుషులకు వేరువేరుగా ఆధునిక వసతులతో భవనాలు నిర్మించినట్టు తెలిపారు. శ్రీవారి సేవకులు వీటిని సద్వినియోగం చేసుకుని భక్తులకు మరింత మెరుగైన సేవలందించాలని కోరారు. బయటివ్యక్తులు రాకుండా వికెట్ గేట్ ఏర్పాటు చేయాలని, భద్రతా సిబ్బందిని నియమించాలని, ఇక్కడి కాలువను సుందరీకరించాలని ఇంజినీరింగ్, భద్రత అధికారులను ఆదేశించారు. అనంతరం ఈ భవనాల్లో శ్రీవారిసేవకులకు కల్పించిన వసతులను తనిఖీ చేశారు. శ్రీవారి సేవకులు బస చేసేందుకు ఏర్పాటుచేసిన మంచాలను, మరుగుదొడ్లను పరిశీలించారు.
జెఈవో వెంట టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, విఎస్‌వో శ్రీ మనోహర్, ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి, ఇఇలు శ్రీ సుబ్రమణ్యం, శ్రీమల్లికార్జునప్రసాద్, సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ, శ్రీవారి సేవ ఏఈవో శ్రీ పి.గోపాలరావు ఇతర సిబ్బంది ఉన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.