AJJADA JAYANTHI CONCLUDES_అచ్చతెలుగు భాష అంటే శ్రీ ఆదిభట్లకు ప్రాణం : శ్రీ మేడసాని మోహన్ _ ముగిసిన శ్రీ ఆదిభట్ల నారాయణదాస154వ జయంతి హరికథా మహోత్సవం

Tirupati, 08 September 2018 ; The 154th Birth Anniversary celebration of Harikatha Pitamaha Sri Ajjada Narayanaya Dasu concluded in Tirupati on Saturday evening.

Speaking on this occasion, in Mahati Auditorium, Dr Medasani Mohan, Telugu Vangamaya Project coordinator said, the beauty of Telugu enhanced through the Harikatha style of Ajjada.

Later Sri Madabhushi Sampath Kumar, Telugu scholar presented a research paper on the life of Sri Ajjada.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అచ్చతెలుగు భాష అంటే శ్రీ ఆదిభట్లకు ప్రాణం : శ్రీ మేడసాని మోహన్

ముగిసిన శ్రీ ఆదిభట్ల నారాయణదాస154వ జయంతి హరికథా మహోత్సవం

తిరుపతి, 08 సెప్టెంబరు 2018; శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుకు అచ్చతెలుగు భాష ప్రాణప్రదమైందని టిటిడి శ్రీనివాస భక్తి వాంగ్మయ అధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి శ్రీ మేడసాని మోహన్ పేర్కొన్నారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీ నారాయణదాస 154వ జయంతి హరికథా మహోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి.

ముగింపు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీ మేడసాని మోహన్ మాట్లాడుతూ శ్రీ నారాయణదాసు తన జీవితకాలం మొత్తాన్ని హరికథకే అంకితం చేశారని కొనియాడారు. బహుభాషావేత్త అయినా మాతృభాషకు పెద్దపీట వేసి అచ్చమైన తెలుగులో మాట్లాడేవారన్నారు. ఏకకాలంలో ఐదు విధాల లయలను ప్రదర్శించేవారని, ఈయనకు పంచముఖేశ్వర అనే బిరుదు ఉందని తెలిపారు. సంగీత, సాహిత్యాలను సరితూచిన త్రాసు నారాయణదాసు అని తిరుపతి వేంకటకవులు, శ్రీశ్రీ లాంటి మహానుభావులు కొనియాడారని తెలియజేశారు.

చెన్నైలోని మద్రాసు వర్సిటి తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ “దాసుగారి జీవిత విశేషాలు”పై పత్ర సమర్పణ చేస్తూ 50కి పైగా గ్రంథాలను రచించిన ఆధిభట్ల వారిని మహారచయిత అని కొనియాడారు.

ఆ తరువాత ఎస్వీ సంగీత కళాశాల హరికథా విభాగం అధ్యాపకులు శ్రీ వేంకటేశ్వర్లు “సుందరకాండ” హరికథాగానం ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి వైవిఎస్.పద్మావతి, అధ్యాపకులు శ్రీ ఎం.సుధాకర్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.