AKHANDA AYODHYAKANDA PARAYANAM HELD _ అయోధ్యకాండ అఖండ పారాయ‌ణంతో పులకించిన స‌ప్త‌గిరులు

Tirumala, 10July 2024: The 12th edition of Akhanda Ayodhyakanda Parayanam was observed at Nada Neeranjanam platform on Wednesday.

SVBC telecasted the spiritual program from 7am to 9am for the sake of global devotees and Vedic pundits from SV Veda Vijnana Peetham, SV Vedic University, TTD Veda pundits and scholars from National Sanskrit University participated along with the devotees.

Under the guidance of Sri Ramanujacharya and Sri Ananta Venugopalakrishna, Dr Maruti of Dharmagiri Veda Vignana Peetham the Parayanam of 141 Shlokas from 45-49 Sargas of Ayodhyakanda were recited.

At the beginning, Sankeertans, Saranu Saranu Neeku and in the last Harihari Rama in the end were sung artists of the Annamacharya Project.

TTD officials, scholars, devotees were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

అయోధ్యకాండ అఖండ పారాయ‌ణంతో పులకించిన స‌ప్త‌గిరులు

తిరుమల, 2024 జూలై 10: లోక‌క‌ల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై బుధవారం ఉదయం జరిగిన 12వ విడ‌త అయోధ్య‌కాండ అఖండ పారాయణం భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది. ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది.

అయోధ్యకాండలోని 45 నుండి 49వ‌ సర్గ వ‌ర‌కు మొత్తం ఐదు స‌ర్గ‌ల్లో 141 శ్లోకాలు, యోగ‌వాశిష్టం మ‌రియు ధ‌న్వంత‌రి మ‌హామంత్రంలోని 25 శ్లోకాలు క‌లిపి మొత్తం 166 శ్లోకాల‌ను పారాయణం చేశారు.

ధర్మగిరి వేద పాఠశాల పండితులు డా. రామానుజాచార్యులు, శ్రీ అనంత గోపాలకృష్ణ, డా.మారుతి శ్లోక పారాయ‌ణం చేశారు. అఖండ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేదాధ్యయ‌న సంస్థకు చెందిన వేదపారాయ‌ణదారులు, జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యానికి చెందిన శాస్త్ర పండితులు పాల్గొన్నా‌రు.

ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి తేజోవతి బృందం “శరణు శరణు నీకు జగదేక వందిత కరుణతో మమ్ము నేలు కౌసల్య నందన …. ” అనే కీర్తనను కార్యక్రమ ప్రారంభంలో, “ హరి హరి రామ నన్నరమర జూడకు నిరతము నీ నామస్మరణ మేమరను దశరధ నందన ……” అనే సంకీర్తనను చివరిలో రసరమ్యంగా ఆలపించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అధికారులు, పండితులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.