AKHANDA PARAYANAM HELD _ అయోధ్యకాండ అఖండ పారాయణంతో మార్మోగిన తిరుమలగిరులు
TIRUMALA, 04 DECEMBER 2023: The fifth edition of Akhanda Ayodyakanda Parayanam took place at Nadaneerajanam platform in Tirumala on Tuesday between 7am and 9am.
A total of 186 shlokas from chapters 14-17 besides 25 Shlokas from Yoga Vasistyam were recited by Vedic pundits and devotees.
Vedic scholars Sri Ramanujacharyulu, Sri Maruti, Sri Ananta Venugopal recited the shlokas. Devotees also recited the shlokas along with the Pundits.
The program began with Pahirama Prabho and concluded with Jaya Hanuman Sankeertans by renowned Annamacharya Project artists Dr. Madhusudhan and Smt Lavanya team.
The programme was telecasted live on SVBC for the sake of global devotees.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అయోధ్యకాండ అఖండ పారాయణంతో మార్మోగిన తిరుమలగిరులు
తిరుమల, 2023 డిసెంబరు 05: తెల్లని పొగమంచు తెరల నడుమ, శేషగిరులే హిమగిరులను తలపిస్తున్న వేళ లోక కల్యాణార్థం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం ఉదయం 7 నుండి 9 గంటల వరకు 5వ విడత అయోధ్యా కాండ అఖండ పారాయణంతో తిరుమలగిరులు మార్మోగాయి.
ఇందులో 14 నుండి 17వ సర్గల వరకు గల 186 శ్లోకాలను పారాయణం చేశారు. యోగవాసిష్టం – ధన్వంతరి మహామంత్రం 25 శ్లోకాలు పారాయణం చేశారు. వేద పండితులు అఖండ పారాయణం చేయగా పలువురు భక్తులు భక్తిభావంతో వారిని అనుసరించి శ్లోక పారాయణం చేశారు.
ధర్మగిరి వేద విజ్ఞానపీఠంకు చెందిన ప్రముఖ పండితులు శ్రీ రామానుజాచార్యులు, శ్రీ అనంత వేణుగోపాల్, శ్రీ మారుతి శ్లోక పారాయణం చేశారు. అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణ దారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన పండితులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ మధుసూదన్, శ్రీమతి లావణ్య బృందం ” పాహిరామ ప్రభో, పాహిరామ ప్రభో….” సంకీర్తనను కార్యక్రమ ప్రారంభంలో, ” జయ హనుమ జయ హనుమ……”నామ సంకీర్తనను చివరిలో ఆలపించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, పండితులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.