AKHANDA PRADHAMA SARGA SUNDARAKANDA PATHANAM ON JULY 7 AT TIRUMALA _ జూలై 7న తిరుమ‌ల‌లో వేదపండితులతో సుంద‌రకాండ ప్ర‌థ‌మ సర్గ శ్లోక అఖండ పారాయ‌ణం

12th ANNIVERSARY OF SVBC

Tirumala, 5 Jul. 20: Sundarakanda Pathanam which was commenced by TTD for the well-being of humanity and global peace has entered 25th day on Sunday and Akhanda Pradhama Sarga Sundarakanda Pathanam will be recited with Veda Pundits at the Nada Niranjanam in Tirumala on July 7.

As a part of this programme, eminent Veda Pundits, TTD Veda Parayadars, Vedic Scholars from Rashtriya Sanskrit Vidya Peetham, Vedic faculty and students of Dharmagiri Veda Vijnana Peetham also participate on this day.

The Sundarakanda epic published by the TTD has 68 chapters with 2880 slokas. On Monday, July 6, the first chapter will conclude. All the 211 slokas in the first chapter will be recited on July 7 during Akhanda Pradhama Sarga Sundarakanda Pathanam.

TTD is also making elaborate stage arrangements following COVID guidelines at Nada Neerajana Mandapam.

It may be recalled that the holy Yogashistam-Dhanvantari Maha mantra Parayanam which began from April 10 concluded on June 10. Followed by

Sundarakanda Pathanam which commenced from June 11 onwards.

This devotional programme is being telecasted live every day by the SVBC channel of TTD between 7am and 8am and is being acclaimed by the devotees globally. Incidentally, on July 7, SVBC celebrates its 12th Anniversary. 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

జూలై 7న తిరుమ‌ల‌లో వేదపండితులతో సుంద‌రకాండ ప్ర‌థ‌మ సర్గ శ్లోక అఖండ పారాయ‌ణం
 
ఎస్వీబిసి 12వ వార్షికోత్స‌వం
 
తిరుమల, 2020 జూలై 05: తిరుమ‌లలోని నాదనీరాజ‌నం వేదిక‌పై జూలై 7న మంగ‌ళ‌వారం ఉద‌యం సుంద‌రకాండ ప్ర‌థ‌మ సర్గ సంపూర్ణంగా 211 శ్లోకాల‌ అఖండ పారాయ‌ణం నిర్వ‌హించ‌నున్నారు. 
 
తిరుమ‌ల‌లో  సుంద‌ర‌కాండ పారాయ‌ణం ప్రారంభించి జూలై 7వ తేదీకి 27 రోజులు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా ప్ర‌ముఖ పండితులు, టిటిడి వేద పారాయ‌ణదారులు, ఎస్వీ ఉన్న‌త వేదాధ్యయ‌న సంస్థ ఆధ్వ‌ర్యంలోని సంభావ‌న‌ వేద పారాయ‌ణదారులు, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, ‌ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాపకులు, విద్యార్థులతో  ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు.
 
టిటిడి ముద్రించిన సుందరకాండలో 68 అధ్యాయా‌లు, 2,880 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో సోమ‌వారం నాటికి ప్ర‌థ‌మ సర్గంలోని 211 శ్లోకాలు పూర్త‌వుతాయి. 
 
కాగా,తిరుమ‌ల‌లో ఏప్రిల్ 10వ తేదీ నుండి ప్రారంభ‌మైన‌ “యోగ‌వాశిస్టం – శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం” పారాయ‌ణం జూన్ 10వ తేదీ వరకు కొనసాగిన విష‌యం విదిత‌మే. అదేవిధంగా జూన్ 11వ తేదీ నుండి ప్రారంభ‌మైన సుంద‌రకాండ  పారాయ‌ణాన్ని ఎస్వీబిసి ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తోంది. ఈ శ్లోక‌పారాయ‌ణ య‌జ్ఞానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా భ‌క్తులు నీరాజ‌నం ప‌లుకుతున్నారు. జూలై 7న శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ 12వ వార్షికోత్స‌వం జ‌రుపుకోవడం విశేషం.  
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.