AKHILA BHARATA HINDU SADHU SANGHAM EXTENDS SUPPORT TO TTD DHARMIC ACTIVITIES _ టిటిడి ధార్మిక కార్యక్రమాలకు అఖిల భారత హిందూ సాధు సంఘం మద్దతు

EO ELABORATES ON TTD SPIRITUAL PROGRAMMES

TIRUMALA, 29 JANUARY 2023: The representatives of Akila Bharata Hindu Maha Sabha and Sadhu Sangham lauded the series of Dharmic and Spiritual programmes which are being observed by TTD for the propagation of Hindu Santana Dharma and univocally extended its support to TTD for its future programmes in taking forward Hindu Dharma.

TTD EO Sri AV Dharma Reddy has formally met the Swamijis at Annamaiah Bhavan in Tirumala on Sunday who participated in the Akhila Bharata Hindu Maha Sabha that was organised in Tirupati on Saturday. He explained them about the various dharmic and spiritual programmes being organised by TTD as a part of its mission of the propagation of Hindu Sanatana Dharma across the country.

The EO briefed them on Veda Parayanam, Homams, construction of temples in SC, ST, BC and fishermen colonies under the funds of SRIVANI (Sri Venkateswara Alaya Nirmana) Trust, Jeernodharana of ancient temples, Srinivasa Kalyanams, Sri Venkateswara Vaibhavotsavams, Go Samrakshana programmes including Go Adharita Naivedyam, Vyavasayam, Gudiko Gomata, Bhagavat Gita competitions, propagation of Annamacharya, Purandharadasa, Alwar works, taking forward all the spiritual programmes in a wide manner through SVBC Telugu, Tamil, Kannada and Hindi channels across the country, free medical services including heart operations to children aged between a few days to 15years, education and many more. “But some vested interests are trying to malign the image of TTD by spreading false and baseless reports on social media against us and throwing the pilgrim public in dilemma and confusion”, he maintained.

The National Secretary of Akhila Bharata Hindu Maha Sabha Sri Kamalesh Acharya of Ayodhya and its Principal Secretary Sri Yogi Atidheshwarananda Parvata Swamiji of Sri Yogi Peetham said that there are nearly six crore members in their Sangham from all the 29 states across the country. “We are all committed to sustain the Hindu Sanatana Dharma in our country. We are impressed with the Dharmic programmes being carried out by TTD and ready to extend our support to all the TTD activities in respective places and also event give the correct information on the Social Media platforms with our wide range of network of devotees who are present across the country”, they added.

TTD EO thanked them for their support. Later the Sadhus felicitated EO and offered him blessings.

Among the Sadhus, AP Chief Sri Ramayanam Mahesh Swamiji of Lalita Bharadwaja Datta Peetham, Telangana Chief Sri Sarveswarananda Ambika Sivacharya Swamiji and many others were present.

AEO Hindu Dharma Prachara Parishad Sri Sriramulu, Superintendent Sri Kranti were also present.

Earlier, over 77 Sadhus including Ayodhya Ram Mandir Trust Vice-President Sri Kamal Nain Das, Sri Mahendra Das, Sri Sharad Sharma were also present and appreciated various pilgrim initiatives taken by TTD in providing hassle-free darshan, accommodation and other amenities.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ధార్మిక కార్యక్రమాలకు అఖిల భారత హిందూ సాధు సంఘం మద్దతు

– టిటిడి ధార్మిక కార్యక్రమాలను వివరించిన ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుమల, 29 జనవరి 2023: హిందూ సనాతన ధర్మ ప్రచారానికి టిటిడి నిర్వహిస్తున్న ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను అఖిల భారత హిందూ మహాసభ, సాధు సంఘం స్వామీజీలు కొనియాడారు. హిందూధర్మ ప్రచారానికి తమవంతు సహకారం అందిస్తామని చెప్పారు. తిరుపతిలో శనివారం నిర్వహించిన అఖిల భారత హిందూ మహాసభలో పాల్గొనేందుకు విచ్చేసిన స్వామీజీలను టిటిడి ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి ఆదివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో కలిశారు.

ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా టిటిడి నిర్వహిస్తున్న పలు ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వారికి వివరించారు. శ్రీవాణి (శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ) ట్రస్టు నిధులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, శ్రీనివాస కల్యాణాలు, శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు, వేదపారాయణం, హోమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. గో సంరక్షణ కార్యక్రమాల్లో భాగంగా గో అధారిత నైవేద్యం, ప్రకృతి వ్యవసాయం, గుడికో గోమాత నిర్వహిస్తున్నామని చెప్పారు.

వీటితో పాటు భగవద్గీత పోటీలు, అన్నమాచార్య, పురంధరదాస సంకీర్తనలు, ఆళ్వార్ల భక్తిసాహిత్య ప్రచారం, ఎస్వీబీసీలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఛానళ్ల ద్వారా శ్రీవారి సేవలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నామని తెలిపారు. పేదలకు ఉచిత వైద్య సేవలతోపాటు 0 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు, విద్యాసంస్థల ద్వారా ఉచితంగా విద్య తదితర ఎన్నో ధార్మిక, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అయితే, కొంతమంది వ్యక్తులు టిటిడికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అవాస్తవాలను, నిరాధారమైన వార్తలను వ్యాప్తి చేసి టిటిడి ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారని, భక్తులను గందరగోళానికి గురి చేస్తున్నారని ఈఓ చెప్పారు.

దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి తమ సంఘంలో దాదాపు ఆరు కోట్ల మంది సభ్యులు ఉన్నారని అఖిల భారత హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి, అయోధ్యకు చెందిన శ్రీ కమలేష్ ఆచార్య, శ్రీ యోగి పీఠం ప్రధాన కార్యదర్శి శ్రీ యోగి అతిధేశ్వరానంద పర్వత స్వామీజీ తెలిపారు. దేశంలో హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. టిటిడి చేపడుతున్న ధార్మిక కార్యక్రమాలు చాలా బాగున్నాయని ప్రశంసించారు. టిటిడి నిర్వహిస్తున్న అనేకానేక ధార్మిక, సంక్షేమ కార్యక్రమాలను, వాస్తవాలను తమ సోషల్ మీడియా నెట్వర్క్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తామని తెలిపారు.

అనంతరం స్వామీజీల సహకారానికి ఈఓ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్వామీజీలు ఈఓను సన్మానించి ఆశీస్సులు అందజేశారు.

సాధు సంఘం ఎపి చీఫ్, లలితా భరద్వాజ దత్త పీఠం నుండి శ్రీ రామాయణం మహేశ్ స్వామీజీ, తెలంగాణ చీఫ్ శ్రీ సర్వేశ్వరానంద అంబికా శివాచార్య స్వామిజీ తదితరులు పాల్గొన్నారు.

కాగా, అయోధ్య రామమందిరం ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కమల్ నయన్ దాస్, శ్రీ మహేంద్ర దాస్, శ్రీ శరద్ శర్మతో సహా 77 మందికి పైగా స్వామీజీలకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఏఈవో శ్రీ శ్రీరాములు, సూపరింటెండెంట్ శ్రీ క్రాంతి కలిసి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా స్వామీజీలు మాట్లాడుతూ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, వసతి, ఇతర సౌకర్యాలను అందిస్తున్న టిటిడి బోర్డును అభినందించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.