AKKAGARLA GUDI PUJA ON DECEMBER 13 _ 13న కనుమ రహదారిలోని అక్కగార్ల గుడిలో కార్తీకమాస పూజలు
TIRUMALA, 11 DECEMBER 2024: The annual Puja ceremony at Akkagarla Gudi located on the First Ghat Road will be observed on December 13. On this occasion, Special Puja will be performed under the aegis of TTD Transport department on Friday.
History:
When TTD was constructing first Ghat Road(Down Ghat Road) in the early1940s, several incidents occurred that hampered the construction process when they removed the seven bricks.
After coming to know about the significance and power of the cave temple by the locals TTD has enshrined these Seven Bricks underneath a huge rock on the First Ghat Road and thereafter the Ghat Road works were completed without any hitch.
AGE OLD BELIEF:
The locals strongly believe that these Seven Bricks of this Cave temple are incarnation of “Saptha Matrukas”- Brahmi, Indrani, Kaumari, Vaishnavi, Maheshwari and Chamundi as mentioned in Puranas. In the local language, they worship them as Saptha Gangammas or Eduguru Akkagarlu.
The locals strongly believe that these Folk Deities are the sisters of Sri Venkateswara Swamy and the Guardians of the pilgrims trekking this route and protect the pilgrims to reach their destination safely avoiding road accidents and untoward incidents during their pilgrimage to Tirumala.
However, TTD has introduced the annual Puja officially in 2008 and since then has been regularly observing this fete in a grand manner. On this auspicious day in the sacred month of Karthika, the employees, locals, devotees offer prayers to these seven folk goddesses seeking their divine blessings
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
13న కనుమ రహదారిలోని అక్కగార్ల గుడిలో కార్తీకమాస పూజలు
తిరుమల, 2024 డిసెంబరు 11: తిరుమల మొదటి కనుమ రహదారిలో గల అక్కదేవతల గుడిలో ఏడుగురు అక్కదేవతలకు 13వ తేది ఉదయం టీటీడీ రవాణా విభాగం ఆధ్వర్యంలో కార్తీకమాస పూజలు నిర్వహించనున్నారు. అక్కగార్లకు ప్రతి సంవత్సరం కార్తీకమాసపూజ నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా టీటీడీ డ్రైవర్లు, స్థానికులు కలిసి ఘనంగా పూజలు నిర్వహిస్తారు.
చారిత్రక ప్రాశస్త్యం
తిరుమల మొదటి కనుమ రహదారిలో చిన్న మందిరంలో శక్తి స్వరూపిణిలు అక్కగార్లుగా కొలువుదీరి పూజనీయంగా దర్శనమిస్తుంటారు. పురాణాలలో ప్రస్తావించిన బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేశ్వరి, చాముండి దేవతలు సప్తమాతృకలుగా ఆ ఆలయంలో పూజలందుకుంటున్నారు. సదా తన భక్తులకు అభయప్రదానం చేస్తూ అభయవరదాతగా తిరుమల క్షేత్రంలో కొలువుదీరిన ఏడుకొండలవాడికే ఆడపడుచులుగా పేరొంది అక్కగార్లు తిరుమల క్షేత్రానికి నలువైపులా రక్షణ కవచంగా కొలువు దీరి ఉన్నారు.
అక్కగార్ల గుడి నిర్మాణం వెనుక చరిత్ర
అక్కగార్ల గుడి నిర్మాణం వెనుక ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉంది. 1940 దశకంలో మొదటి కనుమ దారి నిర్మాణ సమయంలో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో అక్కగార్ల శిలలు ఉండేవని చెబుతారు. ఆ సమయంలో ఈ శిలలను తొలగించి నిర్మాణం చేపట్టారు. దాంతో రోడ్డు నిర్మాణానికి అవరోధాలు కలగడం ప్రారంభమయ్యాయి. ప్రమాదాలు జరిగాయి. ఈ తరుణంలో స్థానికులు అక్కగార్ల శిలల ప్రాశస్త్యాన్ని గురించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఉన్నతాధికారులు సత్వరమే సప్తమాతృకలను రోడ్డు పక్కనే పెద్ద బండరాతికింద ప్రతిష్ఠించి, పూజలు నిర్వహించారు. ఆ క్రతువు పూర్తికావడంతో మొదటి ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు సాఫీగా పూర్తయింది.
2008 నుండి అక్కగార్ల గుడిలో సంవత్సరంలో కార్తీక మాసంలో ఒక రోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం ప్రారంభించింది. అప్పటినుండి మొదటి ఘాట్ రోడ్ లోని
అవ్వాచారి కోన వద్ద వెలసి ఉన్న అక్కగార్లకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.