ALL DEPARTMENTS GEARED UP FOR NAVARATRI BRAHMOTSAVAMS-TTD EO _ అంగరంగ వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు- టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి
REQUIRED MANPOWER SET READY-DISTRICT COLLECTOR AND SP
TIRUMALA, 10 OCTOBER 2023: As the Navaratri Brahmotsavams in Tirumala are set to commence from October 15 to 23 with Ankurarpanam on October 14, all departments have geared up for the big festival, said TTD EO Sri AV Dharma Reddy.
Speaking to media persons at Annamaiah Bhavan in Tirumala on Tuesday along with District Collector Sri Venkatramana Reddy and SP Sri Parameshwar Reddy, the EO said, the important days includes, Garuda Seva on October 19, Pushpaka Vimanam on October 20, Golden Chariot on October 22 and Chakrasnanam on October 23.
The EO said, in view of brahmotsavams, all the privileged darshans like senior citizens, physically challenged, parents with infants remain cancelled. In view of Garuda Seva on October 19, two-wheelers will not be allowed to ply on the Ghat roads on that day. “As the devotees throng Tirumala on the previous day night itself in the galleries of four mada streets to witness Garuda Vahana Seva, we are contemplating to advance the Vahana Seva on October 19 after negotiating with the chief priests of Tirumala temple, in the larger interests of pilgrims”, he added.
Later the District Collector and SP also informed the media that their departments are ready to provide the required manpower and support to TTD towards the smooth conduct of the ensuing Navaratri Brahmotsavams.
Earlier, a detailed review meeting was held over the department-wise arrangements.
JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CE Sri Nageswara Rao and other officials from TTD, district administration, police, RTC were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER
అంగరంగ వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో భక్తులకు సేవలు : టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి
ప్రభుత్వపరంగా పూర్తి సహకారం – జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ
తిరుమల, 2023 అక్టోబరు 10: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట్రమణారెడ్డి, ఎస్పీ శ్రీ పరమేశ్వర్‌రెడ్డితో కలిసి ఈవో బ్రహ్మోత్సవాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, అక్టోబరు 14వ తేదీ అంకురార్పణంతో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలకు టీటీడిలోని అన్ని విభాగాలు సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టినట్లు ఆయన చెప్పారు. అక్టోబరు 19న గరుడసేవ, 20న పుష్పక విమానం, 22న స్వర్ణరథం, అక్టోబర్ 23న చక్రస్నానం నిర్వహించనున్నట్లు తెలిపారు.
బ్రహ్మోత్సవాలలో వయోవృద్ధులు, దివ్యాంగులు, సంవత్సరం లోపు చిన్నపిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేసినట్లు ఈవో చెప్పారు. అక్టోబర్ 19న గరుడసేవ సందర్భంగా ఆ రోజు ద్విచక్ర వాహనాలను అనుమతించరన్నారు. ‘‘ గరుడసేవనాడు గరుడ వాహనాన్ని వీక్షించేందుకు ముందు రోజు రాత్రి నుండే అసంఖ్యాకంగా భక్తులు గ్యాలరీలలో వేచి ఉంటారన్నారు. కావున భక్తుల సౌకర్యార్థం గరుడ వాహనాన్ని ముందుగా ప్రారంభించేందుకు సాధ్య సాధ్యాలను అర్చకులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు” ఆయన తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ కూడా మీడియాతో మాట్లాడుతూ, నవరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించడానికి టీటీడీతో సమన్వయం చేసుకొని అన్ని ప్రభుత్వ విభాగాలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
అంతకుముందు ఈవో విభాగాల వారీగా ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, సిఈ శ్రీ నాగేశ్వరరావు, టీటీడీ, జిల్లా యంత్రాంగం, పోలీసు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.