ALL MODERN AMENTIES AT TTD KALYANA MANDAPAM_ అత్యాధునిక సౌకర్యాలతో టిటిడి కల్యాణ మండపాలు
Tirupati, 14 Jun. 19: The TTD Kalyana mandapams have been fully renovated with modern amenities and among them, the Kalyana mandapams at Rajam in Srikakulam District in AP and Mahboobnagar in Telangana are grandly showcased as models.
On the directions of TTD EO Sri Anil Kumar Singhal, and supervision of Joint Executive Officer in Tirupati, Sri Lakshmi Kantham all the TTD Kalyana mandapams Are attractively refurbished with LED lights, latest fans, redone rooms for bride and grooms, dining halls and modernised kitchen.
The walls in the Kalyana Mandapam were decorated with paintings on episodes from Srivari Parinayotsavam, re-engineering of drainage, new toilets, green landscape with flower gardens are some of the development works completed.
Many more Kalyana mandapam will soon be redesigned with latest amenities on the lines of those at Rajam, Mahaboobnagar, Kuppam, Narsapuram and Bangalore which all have recently graded with ISO certificates.
All the 256 TTD Kalyana Mandapam have been brought on online booking through the ttdsevaonline.com. They include 184 in AP, 65 in Telangana, 01 in Odisha, 03 in Karnataka, 01 in Kerala and 02 in Tamil Nadu.
The devotees could perform all social functions like weddings; Thread ceremony, Namakaranam, Shasti-Poorti, Anna prasana, Satyanarayana vratam, and wedding receptions etc.
After registration on the website ttdsevaonline.com, devotees should select their location: State, District etc., select vacancy dates,
Upload their data like Aadhar card, photo Id, contact details and make the payment now have specified fees. Thereafter they would get an SMS, which will be their receipt, which the concerned supervisor of Kalyana Mandapam will also get a copy for verification at times of the event.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అత్యాధునిక సౌకర్యాలతో టిటిడి కల్యాణ మండపాలు
తిరుపతి, 2019 జూన్ 14: దేశ వ్యాప్తంగా ఉన్న టిటిడి కల్యాణ మండపాల ఆధునీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇటీవల ఆంధ్ర ప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, శ్రీకాకుళం జిల్లా రాజం, తెలంగాణ రాష్ట్రం మహబుబ్‌నగర్‌లోని టిటిడి కల్యాణ మండపాలను అద్భుతంగా తీర్చిదిద్ధారు.
టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం పర్యవేక్షణలో కల్యాణ మండపాలను మరమత్తులు చేసి ఆకర్షణీయంగా రంగులు వేశారు. కల్యాణ మండపంలో వంట, భోజనశాల, వధువు, వరుడు గదులను ఆధునీకరించారు. కల్యాణ మండపం లోపల ఎల్ఈడి లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు.
కల్యాణ వేదికపై శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవం, గోడలపై శ్రీవారి వివిధ అంకరణలతో కూడిన ఫోటోలు, బయటి గోడలపై ఆకట్టుకునేల పెయింటింగ్ ఏర్పాటు చేశారు. కల్యాణ మండపంలో పారిశుద్ద్యనికి పెద్ద పీట వేస్తూ, డ్రైనేజి, మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. కల్యాణ మండపం లోపల, బయట అహ్లాదకరంగా ఉండేందుకు పచ్చదనం పెంపొందించడంలో భాగంగా వివిధ పుష్పాల మొక్కలతో గార్డన్ ఏర్పాటు చేశారు.
చాలా కల్యాణ మండపాలు ఆధునీకరణ పూర్తి చేసుకుని భక్తులకు అందుబాటులో ఉన్నాయి. త్వరలో మరిన్ని మండపాలను ఆధునిక వసతులతో అందుబాటులోనికి రానున్నాయి. ఇటీవల కుప్పం, రాజాం, నర్సాపూర్, మహబూబ్‌నగర్, బెంగళూరులోని కల్యాణ మండపాలకు ఐఎస్‌వో గుర్తింపు లభించిన విషయం విదితమే.
ఆన్‌లైన్‌లో 256 టిటిడి కల్యాణమండపాల బుకింగ్ సదుపాయం
దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో 302 టిటిడి కల్యాణ మండపాలు ఉన్నాయి. ఇందులో 256 కల్యాణ మండపాలను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయాన్ని భక్తులకు టిటిడి అందుబాటులోకి తీసుకొచ్చింది. ttdsevaonline.com వెబ్‌సైట్‌లో టిటిడి కల్యాణమండపాలను బుక్ చేసుకోవచ్చు.
ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలలో 184, తెలంగాణలో 65, ఒడిశాలో 01, కర్ణాటకలో 03, కేరళలో 01, తమిళనాడులో 02 కల్యాణ మండపాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. టిటిడి కల్యాణమండపాల్లో అత్యాధునిక వసతులు కల్పించి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సౌకర్యం టిటిడి కల్పించింది.
వివాహం, ఉపనయనం, నిశ్చితార్థం, నామకరణము (బారసాల), షష్టిపూర్తి, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, రిసెప్షన్ వంటి శుభకార్యాలకు టిటిడి కల్యాణమండపాలను బుక్ చేసుకోవచ్చు.
ఎలా బుక్ చేసుకోవాలి..
www.ttdsevaonline.com వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అనంతరం రాష్ట్రం, జిల్లా, సంబంధిత ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. అక్కడ ఖాళీగా ఉన్న తేదీలను ఎంపిక చేసుకున్న తరువాత ఫొటోతోపాటు, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌లలో ఏదోఒకటి అప్‌లోడ్ చేయాలి. కల్యాణమండపాల స్థాయిని బట్టి నిర్దేశించిన రుసుమును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత సంబంధిత వ్యక్తులకు, కల్యాణమండపం పర్యవేక్షణ అధికారికి ఎస్‌ఎంఎస్ వస్తుంది. ఈ ఎస్‌ఎంఎస్‌ను చూపి కల్యాణమండపంలో కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.