JYESTABHISHEKAM BEGINS AT SRIVARI TEMPLE_ శ్రీవారి ఆలయంలో ఘనంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం వేడుకగా స్నపనతిరుమంజనం
Tirumala, 14 Jun. 19: The holy traditional three day ritual of Jyestabhisekam aimed at reviving the divine charm and vibrations of the Srivari and his consorts utsava idols commenced in the Srivari temple on Friday morning in the Kalyana mandapam of the sampangi prakaram.
The ritwiks completed the kankana dharana after the snapana thirumanjanam rituals at the yagashala with Shanti Homam, shata kalasha Protista avahana, Nava kalasha avahana and kankana Pratista.
Later in the evening the utsava idols of Lord Malayappaswamy and his consorts will be adorned with diamond kavacham and paraded on the mada streets to bless the devotees.
In view of Jyestabhisekam event, the TTD has cancelled arjita sevas like Nijapada Darshana and Vasantotsavam on Friday.
TTD EO Sir Anil Kumar Singhal, Sri Sri Sri Pedda Jeeyar and Chinna Jeeyar, temple Chief Priest Sri Venugopal Dikshitulu, DyEO Sri Harindranath, Peishkar Sri Lokanathan and others participated.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి ఆలయంలో ఘనంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం వేడుకగా స్నపనతిరుమంజనం
జూన్ 14, తిరుమల 2019: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్ఠాభిషేకం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణమండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం ఋత్వికులు యాగశాలలో శాంతిహోమం నిర్వహించారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి, అమ్మవార్లకు అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం చేసి కంకణధారణ చేశారు. ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో వేదపండితులు శ్రీసూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠిస్తుండగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు.
కాగా, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్రకవచాన్ని అలంకరిస్తారు. సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు వజ్రకవచంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఇదిలా ఉండగా శనివారం ముత్యపుకవచంతో, ఆదివారం స్వర్ణకవచంతో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు. జ్యేష్ఠాభిషేకం కారణంగా శుక్రవారం నిజపాద దర్శనం, వసంతోత్సవం ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.