ALL SET FOR TWO-DAY GO MAHA SAMMELAN AT MAHATI AUDITORIUM _ తిరుపతి మహతి కళాక్షేత్రంలో గో మహాసమ్మేళనం ఏర్పాట్లు పూర్తి

Tirumala, 29 October 2021: All arrangements for the two-day Go Maha Sammelan organised by TTD at Mahati auditorium in Tirupati are in place to host the mega event on Saturday.

 

The pilgrim city of Tirupati is all set to receive pontiffs and heads of over 30 mutts across the country, exponents of Go-based organic farming and nearly 2000 farmers who are coming to participate in this unique fete.

 

The Mahati auditorium is colourfully decorated with flowers and electrical illumination. The rangoli done on cow dung water smeared floor recreated the traditional village look. Over 50 Srivari Sevakulu are involved in these activities.

 

The welcome arches made of banana, mango leaves and coconut bunches and decorative flower garlands have infused a village-style environment at the stage.

 

24 stalls have also been set up at the Mahati premises showcasing recent initiatives taken up by TTD including Agarbattis, Pancha gavya products, TTD publications, Dry flower technology products like portraits etc.

 

The Yuga Tulasi Foundation and SEVA Organization has put up 20 stalls to display traditional oil grinds, Pancha gavya products, Desi ghee products, organic seeds, traditional cooking vessels, herbal products, kalamkari artefacts and other organic products by farmers from all regions of AP and Telangana.

 

All farmer delegates for the Sammelan from both Telugu states are being accommodated at Srinivasam, SV rest house, the 2&3 Choultries, Padmavathi Nilayam in Tiruchanoor.

 

The TTD Anna Prasadam wing is fully geared to cater to provide traditional food to farmers like breakfast, lunch & dinner and purified drinking water with the help of 200 Srivari Sevakulu.

 

All departments of TTD are making coordinated efforts to organise food, transport and accommodation for all Pontiffs, Mutt heads and farmers coming for the first-ever conference organised for spreading awareness on Go-based organic farming, Go Samrakshana and Goshala maintenance in the country.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుపతి మహతి కళాక్షేత్రంలో గో మహాసమ్మేళనం ఏర్పాట్లు పూర్తి

తిరుపతి, 2021 అక్టోబరు 28: తిరుపతి మహతి కళాక్షేత్రంలో అక్టోబరు 30 మరియు 31వ తేదీల్లో టిటిడి ఆధ్వ‌ర్యంలో ” గో మ‌హా స‌మ్మేళ‌నం ” కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఇందులో భాగంగా మహతి కళాక్షేత్రం వద్ద దాదాపు 50 మంది మహిళా శ్రీవారి సేవకులు గోమయంతో రంగరించిన నీళ్లు చిలకరించి, రంగవల్లులు తీర్చిదిద్దారు. అదేవిధంగా ప్రవేశ ద్వారాల వద్ద, పందిళ్ళు, వరి తోరణాలు, సాంప్రదాయ పుష్పాలతో సర్వాంగసుందరంగా గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా అలంకరించారు.

మహతి కళాక్షేత్రం ప్రాంగణంలో 24 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో నాలుగు స్టాల్స్ టీటీడీ ఆధ్వర్యంలో ఉత్పత్తి చేయబడుతున్న అగరబత్తులు, ఆయుర్వేద – పంచగవ్య ఉత్పత్తులు, టిటిడి ప్రచురణలు, డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన చిత్రపటాలను ఉంచనున్నారు.

యుగతులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20 స్టాల్స్ లో ప్రాచీన భారతదేశంలో ప్రతి గ్రామంలో ఉండే ఎద్దులతో తిరిగే గానుగలు, గో ఆధారిత పంచగవ్య, నెయ్యి ఉత్పత్తులు దేశీయ విత్తనాలు, పూర్వకాలం నుండి ఉపయోగించే వంట పాత్రలు, చెట్ల బెరడు పూలతో తయారు చేసిన హెర్బల్స్, కలంకారి వస్తువులు, రైతులు గో ఆధారిత వ్యవసాయంతో తయారు చేసిన ఉత్పత్తులతో ఏర్పాటు చేయనున్నారు.

గో మహా సమ్మేళనానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి విచ్చేసే రైతులకు శ్రీనివాసం వసతి సముదాయము, ఎస్.వి.విశ్రాంతి భవనం,పద్మావతి నిలయం, గోవిందరాజస్వామివారి 2,3వ సత్రాల్లో వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు. టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో గో సమ్మేళనానికి విచ్చేసే రైతులకు సాంప్రదాయ భోజనం, త్రాగునీరు, అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

టీటీడీ లోని అన్ని విభాగాల సమన్వయంతో గో మహా సమ్మేళనానికి హాజరవుతున్న స్వామీజీలు, మఠాధిపతులు, రైతులకు వసతి, ఆహారం, రవాణా ఏర్పాట్లు చేశారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది