ALLSET FOR CHAKRASNANAM_ చక్రస్నానం ఏర్పాట్లను త‌నిఖీ చేసిన జెఈవో

Tirumala, 20 September 2018: The stage is set for Chakra Snanam on Friday morning, with which the annual brahmotsavams concludes, said Tirumala JEO Sri KS Sreenivasa Raju.

During his inspection at Swamy Pushkarini on Thursday evening, the JEO instructed the duty officers to ensure that there is no problem caused to pilgrims while entering in to the gates.

Later he said, as the sanctity of taking bath in holy waters lasts for the entire day, the pilgrims are requested to maintain patience and take holy dip without any hurry.

CVSO Incharge Sri Siva Kumar Reddy, VGOs Smt Sada Lakshmi, Sri Ravindra Reddy, SE 2 Sri Ramachandra Reddy and other duty officers were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

చక్రస్నానం ఏర్పాట్లను త‌నిఖీ చేసిన జెఈవో

 తిరుమల, 2018 సెప్టెంబ‌రు 20: శ్రీవారి బ్రహ్మోత్సవాల చివ‌రి రోజైన శుక్ర‌వారం ఉద‌యం జ‌రుగ‌నున్న చ‌క్ర‌స్నానం ఏర్పాట్ల‌ను గురువారం సాయంత్రం టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు త‌నిఖీ చేశారు. భ‌క్తులు పుష్క‌రిణిలోకి ప్ర‌వేశించేందుకు, తిరిగి వెలుప‌లికి వెళ్లేందుకు ఏర్పాటుచేసిన గేట్ల‌ను ప‌రిశీలించారు. టిటిడి అధికారులు, విజిలెన్స్‌, పోలీసులు స‌మ‌న్వ‌యం చేసుకుని భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. 

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ ఉద‌యం 7.30 నుండి 10 గంట‌ల మ‌ధ్య శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌కు, చ‌క్ర‌త్తాళ్వార్‌కు స్న‌ప‌న‌తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. చక్రస్నానం రోజున రోజంతా పవిత్ర ఘడియలు ఉంటాయని భక్తులు ఎప్పుడైనా పుష్కరిణిలో స్నానం చేయవచ్చని వివ‌రించారు. భక్తులు నిర్దేశించిన గేట్ల ద్వారా పుష్క‌రిణిలోకి ప్ర‌వేశించాల‌ని, ఈ సంద‌ర్భంగా సంయమనం పాటించి టిటిడికి సహకరించాలని జెఈవో కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పుష్కరిణిలో ఈతగాళ్లను, బోటును అందుబాటులో ఉంచుతామ‌న్నారు. ఆలయ పరిసరాల్లో ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటుచేసి భక్తులకు చక్రస్నానాన్నివీక్షించే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. 

ఈ త‌నిఖీల్లో టిటిడి ఇన్‌చార్జి సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఎస్ఇలు శ్రీ రామ‌చంద్రారెడ్డి, శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, విఎస్ఓలు శ్రీ ర‌వీంద్రారెడ్డి, శ్రీ‌మ‌తి స‌దాల‌క్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.