PAVITRA PRATISTHA OBSERVED_ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా పవిత్ర ప్రతిష్ఠ
Tirupati, 20 September 2018: On the first day of three day annual Pavitrotsavams in Sri Govinda Raja Swamy temple in Tirupati, Pavitra Pratishta was observed on Thursday.
After snapana tirumanjanam in Yagashala, the utsava muthies of Sri Govinda Raja Swamy flanked by Sridevi and Bhudevi were taken on a celestial procession in the evening.
On Friday, Pavitra Samarpana will be observed.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా పవిత్ర ప్రతిష్ఠ
సెప్టెంబరు 20, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాల్లో భాగంగా గురువారం పవిత్ర ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామిమవారిని మేల్కొలిపి తోమల, సహస్రనామార్చన చేపట్టారు. ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు యాగశాలలో అకల్మష ప్రాయశ్చిత్తం, పంచగవ్య ప్రాసన, వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉదయం 11.00 నుంచి 12.30 గంటల వరకు కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు ఇతర సుగంధద్రవ్యాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి ఉత్సవమూర్తులకు తిరువీధి ఉత్సవం జరుగనుంది. రాత్రి 7.30 నుండి 9.00 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 21న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 22న పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- టికెట్ కొనుగోలు చేసి ఈ పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. ఒక పవిత్రం ప్రసాదంగా అందజేస్తారు.
ఈ కార్య్రకమంలో స్థానిక ఆలయాల డెప్యూటి ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీ ఉదయ్ భాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ జ్ఞానప్రకాష్, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఎ.పి. శ్రీనివాస దీక్షితులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.