శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా ముగిసిన శ్రీ ఆండాల్‌ అమ్మవారి నీరాటోత్సవం

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా ముగిసిన శ్రీ ఆండాల్‌ అమ్మవారి నీరాటోత్సవం

జనవరి 13, తిరుపతి 2019: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్‌ అమ్మవారి నీరాటోత్సవం ఆదివారం ఘనంగా ముగిసింది. జనవరి 7 నుండి శ్రీ ఆండాళ్‌ అమ్మవారికి నీరాటోత్సవం నిర్వహిస్తున్న విషయం విదితమే.

చివరిరోజు ఉదయం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు శ్రీగోవిందరాజ స్వామివారి ఆలయం నుండి శ్రీ రామచంద్ర పుష్కరిణికి ఊరేగింపుగా చేరుకున్నారు. అక్కడ వేడినీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం వరకు అమ్మవారు అక్కడే ఉండి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 5.00 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు శ్రీ కోదండరామాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఊరేగింపుగా తిరిగి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ఆండాళ్‌ అమ్మవారు స్వామివారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్‌చార్జి డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీ, ఎఈవో శ్రీ ఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీహరి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కృష్ణమూర్తి, శ్రీప్రశాంత్‌, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.