ANDAL GODA DEVI MALAS REACHES TIRUMALA _ తిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలు

Tirumala, 07 October 2024: Andal Sri Goda Devi Malas also known as Andal malas, are traditional garlands made from flowers like Tulasi, Chamanti and Sampangi along with the Parrots made of leaves. 
 
They will be adorned to the presiding deity of Sri Venkateswara on the day of Garuda Seva. 
 
ANDAL AND SHIKHAMANI MALAS BY TWO FAMILIES:
 
The two garlands also known as Andal Mala – Shikamani Mala are kept in big baskets and were offered by two families of flower makers of Srivalliputhur, Tamilnadu which is about 650 kms from Tirupati and were accompanied by around 50 devotees.
 
Legend says that the malas were first worn by Goda Devi, daughter of the great Sri Vaishnava Saint Sri Periyalwar also known as Vishnuchitta of Sri Rangamannar temple in Srivalliputhur and offered to the presiding deity of Sri Ranganatha. 
 
Noticing this, when Periyalwar admonished and stopped, the deity had refused to accept the garlands as they were not worn by Goda Devi. This incident speaks to the amount of reverence of Goda Devi towards Her Ista Daiva, none other than Sri Ranganatha.
 
Andal Sri Goda Devi also happens to be only female poetess among the Twelve Sri Vaishnava Alwars who penned hymns in the praise of Sri Maha Vishnu.
 
The sacred garlands reached Tirumala Pedda Jeeyar Mutt located adjacent to Sri Bedi Anjaneya Swamy temple. After offering special pujas, the garlands were taken on a procession around the four mada streets before they reached the main temple. 
 
The Goda Malas were a part of the holy dictum during the Brahmotsavams which will be adorned on the prestigious and most auspicious day of Garuda seva on October 8.
 
Both the pontiffs of Tirumala, TTD EO Sri J Syamala Rao, Additional EO Sri Ch Venkaiah Chowdary, Temple DyEO Sri Lokanatham, representatives of Srivilliputtur Devasthanam and others were also present.
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలు

తిరుమల, 2024 అక్టోబ‌రు 07: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవిమాలలు సోమ‌వారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద గ‌ల‌ శ్రీ పెద్దజీయ‌ర్‌ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అక్కడ తిరుమ‌ల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంత‌రం ఆలయ మాడవీధుల గుండా మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు.

రెండు కుటుంబాల వారీగా ఆండాళ్ మరియు శిఖామణి మాలలు :

ఆండాళ్ మాల – షికామణి మాల అని కూడా పిలువబడే రెండు దండలు పెద్ద బుట్టలలో ఉంచి, తిరుపతికి 650 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడులోని శ్రీవల్లిపుత్తూరుకు చెందిన రెండు కుటుంబాల పూల తయారీదారులు సమర్పిస్తున్నారు.

భూదేవి అవతారం గోదాదేవి

శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగమన్నార్‌స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్‌ పుష్పకైంకర్యం చేసేవార‌ని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేవార‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్‌ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించార‌ని పురాణ క‌థ‌నం. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని భావిస్తారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు, అద‌న‌పు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, డెప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, శ్రీవిల్లిపుత్తూరు ఆల‌య స్థానాచార్యులు శ్రీ రంగరాజన్, శ్రీ సుద‌ర్శ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.