ANDAL TIRUVADIPUDI UTSAVAM COMMENCES _ శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం ఉత్సవం ప్రారంభం

TIRUPATI, 02 AUGUST 2021: The Andal Tiruvadippudi Utsavam commences in Sri Govindraja Swamy temple at Tirupati on Monday.

This ten-day fete concludes on August 11 with Andal Sattumora in between events like Chakrattalwar and Prativadi Bhayankara Sattumora on August 8.

Special Gr.DyEO Sri Rajendrudu and others were also present.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం ఉత్సవం ప్రారంభం

తిరుపతి, 2021 ఆగ‌స్టు 02: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సోమ‌వారం శ్రీ ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఉదయం శ్రీ ఆండాళ్‌ అమ్మవారికి వేడుక‌గా తిరుమంజనం నిర్వ‌హించారు. సాయంత్రం అమ్మవారిని ఆలయ ప్రాంగ‌ణంలో తిరుచ్చిపై ఊరేగింపు నిర్వహించారు.

ఆగస్టు 8వ తేదీన ఆల‌యంలో శ్రీ చ‌క్ర‌త్తాళ్వార్ సాత్తుమొర‌, శ్రీ ప్ర‌తివాది భ‌యంక‌ర అన్న‌న్ సాత్తుమొర జ‌రుగ‌నున్నాయి. ఆగస్టు 11న శ్రీ ఆండాళ్‌ అమ్మవారి శాత్తుమొర సంద‌ర్భంగా ఉదయం శ్రీ గోవిందరాజ స్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సంద‌ర్భంగా అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద‌కు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారికి నిర్వ‌హించే ఊరేగింపును కోవిడ్‌-19 కార‌ణంగా టిటిడి ర‌ద్దు చేసింది. ఈ కార‌ణంగా ఆల‌యంలోనే ఉభ‌య‌దారులు ఉభ‌యం స‌మ‌ర్పిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ ఎపి.శ్రీ‌నివాస దీక్షితులు, ఏఈవో శ్రీ ర‌వికుమార్ రెడ్డి, సూప‌రింటెండెంట్లు శ్రీ కుమార్‌, శ్రీ వెంక‌టాద్రి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ కామ‌రాజు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.