ANIVARA ASTHANAM HELD IN ALL LOCAL TEMPLES OF TTD _ టిటిడి స్థానికాల‌యాల్లో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం

TIRUPATI, 16 JULY 2021: The annual Anivara Asthanam was held with religious fervour in all the local temples of Tirupati on Friday.

Usually observed following the traditional practice of presenting annual budget in the presence of presiding deity through a customary temple court called Asthanam. 

This traditional budget event which has been in vogue since the age of Mahants is being observed on this auspicious day every year in all the temples of TTD.

Anivara Asthanam was observed with utmost fervour in Sri Govindaraja Swamy and Sri Kodanda Rama Swamy temples following Covid norms.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి స్థానికాల‌యాల్లో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం

తిరుపతి, 2021 జూలై 16: తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం, శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యాల‌లో శుక్ర‌వారం సాయంత్రం ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జ‌రిగింది.

ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టిటిడి వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు, వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్‌ నెలలకు మార్చారు.

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారిని వేంచేపు చేసి సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు ఆస్థానం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ పుండ‌రీక వ‌ల్లి అమ్మ‌వారి ఆల‌యం నుండి నూత‌న వ‌స్త్రాల‌ను విమాన ప్ర‌ద‌క్ష‌ణ‌గా తీసుకువ‌చ్చి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారికి స‌మ‌ర్పించారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి, ఏఈవో శ్రీ ర‌వికుమార్ రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ వెంక‌టాద్రి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ మునీంద్ర బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

శ్రీ కోదండరామాలయంలో

శ్రీ కోదండరామాలయంలో శుక్ర‌వారం సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు ఆలయంలోని గరుడాళ్వార్‌ ఎదురుగా శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరాములవారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ప్రత్యేకంగా ఆణివార ఆస్థానం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వ‌తి, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.