ANKURARPANA FOR PUSHPAYAGAM IN SRI GT HELD _ శాస్త్రోక్తంగా శ్రీ గోవిందరాజస్వామివారి పుష్పయాగానికి అంకురార్పణ

Tirupati, 17 Jun. 21: The Ankurarpana ritual for the annual Pushpayagam in Sri Govinda Raja Swamy temple was observed in Ekantam in view of Covid restrictions on Thursday.

On Friday the flower festival will be performed between 2pm and 4pm with tonnes of varieties of flowers.

In this traditional seed sowing religious event, Special Gr. Dy. E. O Sri Rajendrudu and other office staff members were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శాస్త్రోక్తంగా శ్రీ గోవిందరాజస్వామివారి పుష్పయాగానికి అంకురార్పణ

తిరుపతి, 2021 జూన్ 17: తిరుపతి శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 18వ తేదీ శుక్ర‌వారం పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం జూన్ 17వ తేదీ గురువారం సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు మృత్సంగ్రాహణం, పుణ్యాహవచనం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్ప‌ణ నిర్వ‌హించారు.

మే 18 నుండి 26వ తేదీ వరకు వరకు శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ ఉత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

జూన్ 18న ఉదయం 10.30 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలు, ప‌త్రాల‌తో స్వామివారికి పుష్ప‌యాగం నిర్వహిస్తారు.

ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌‌ రెడ్డి, ప్రధాన అర్చకులు శ్రీ ఎపి శ్రీనివాస దీక్షితులు సూపరింటెండెంట్‌ శ్రీ వెంక‌టాద్రి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ మునీంద్ర‌బాబు, శ్రీ కామరాజు అర్చకులు, పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.