ANKURARPANA FOR SAKALA KARYA SIDDHI RAMAYANA PARAYANAM HELD _ స‌క‌లకార్య‌సిద్ధి శ్రీ‌మ‌ద్ రామాయ‌ణ పారాయ‌ణానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

TIRUMALA, 24 JULY 2021: Ankurarpanam for the unique spiritual program, Sakala Karya Siddhi Ramayana Parayanam was held at Dharmagiri Veda Vignana Peetham in Tirumala on Saturday evening.

As a part of it’s a spiritual mission, TTD has embarked upon yet another innovative recitation programme, Sakala Karya Siddhi Ramayana Parayanam from July 25 to August 23 at Vasantha Mandapam in Tirumala.

The chief aim of this Parayanam is that all the living beings should lead a peaceful and prosperous life. And all the activities which came to a standstill due to the Covid pandemic across the globe should resume without any further interruptions and disturbances.

The shlokas from some of the important chapters of Balakanda, Ayodhyakanda, Aranyakanda, Kishkindakanda, Sundarakanda, Yuddhakanda will be recited every day in Vasanta Mandapam at Tirumala between 8:30am and 10am which will be telecasted live on SVBC for the sake of global devotees.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

స‌క‌లకార్య‌సిద్ధి శ్రీ‌మ‌ద్ రామాయ‌ణ పారాయ‌ణానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుమల, 2021 జులై 24: శ్రీ‌వారి అనుగ్ర‌హంతో సృష్టిలోని స‌క‌ల జీవ‌రాశులు సుభిక్షంగా ఉండాల‌ని, అన్ని కార్య‌క్ర‌మాలు స‌జావుగా సాగాల‌ని కోరుకుంటూ జులై 25 నుండి ఆగ‌స్టు 23వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల‌లో త‌ల‌పెట్టిన స‌క‌లకార్య‌సిద్ధి శ్రీ‌మ‌ద్ రామాయ‌ణ పారాయ‌ణానికి శ‌నివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది. ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠంలో రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది. ఇందులో భాగంగా సంక‌ల్పం, గ‌ణ‌ప‌తి పూజ‌, పుణ్యాహ‌వ‌చ‌‌నం, రుత్విక్‌వ‌ర‌ణం, కంక‌ణ ధార‌ణ‌, అగ్నిప్ర‌తిష్ట‌, అంకురార్ఫ‌ణ నిర్వ‌హించారు.

కోవిడ్ – 19 కార‌ణంగా నిలిచిపోయిన అన్ని కార్య‌క్ర‌మాలు తిరిగి ప్రారంభం కావాల‌ని స్వామివారిని ప్రార్థిస్తూ 30 రోజుల‌ పాటు టిటిడి శ్రీ‌మ‌ద్ రామాయ‌ణ పారాయ‌ణ‌ కార్య‌క్ర‌మాన్ని త‌ల‌పెట్టింది. తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని ఆధ్వ‌ర్యంలో వ‌సంత మండ‌పంలో రామాయ‌ణంలోని బాల‌కాండ, అయోధ్య‌కాండ‌, అర‌ణ్య‌కాండ‌, కిష్కింధ‌కాండ‌, సుంద‌ర‌కాండ‌, యుద్ధ‌కాండలోని ప్ర‌ధాన‌మైన స‌ర్గ‌ల‌ను పారాయ‌ణం చేస్తారు. ప్ర‌తిరోజూ ఉద‌యం 8.30 నుండి 10 గంట‌ల వ‌ర‌కు జ‌రుగ‌నున్న ఈ శ్లోక పారాయ‌ణాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది. మ‌రోవైపు ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠంలో ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో హోమాలు, జ‌పాలు నిర్వ‌హిస్తారు. ఈ కార్య‌క్ర‌మాల్లో మొత్తం 32 మంది వేద‌పండితులు పాల్గొంటారు. ఒక్కో రోజు ఒక్కో ధ‌ర్మ‌కార్యం సిద్ధించాల‌ని కోరుతూ ఆయా కాండ‌ల్లోని ప్ర‌ధాన‌మైన స‌ర్గ‌ల‌ను పారాయ‌ణం చేస్తారు.

తొలిరోజైన జులై 25వ తేదీన ఆదివారం ధ‌ర్మ‌కార్య‌సిద్ధి కోసం అయోధ్య‌కాండ‌లోని 21 నుండి 25 స‌ర్గ‌ల్లో గ‌ల 221 శ్లోకాలు, జ‌న్మాంత‌ర స‌క‌లసౌఖ్య‌ప్రాప్తి కోసం యుద్ధ‌కాండ‌లోని 131వ స‌ర్గ‌లో గ‌ల 120 శ్లోకాలు క‌లిపి మొత్తం 341 శ్లోకాల‌ను పారాయ‌ణం చేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.