POURNAMI GARUDA SEVA HELD _ తిరుమ‌ల‌లో వైభ‌వంగా పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

TIRUMALA, 23 JULY 2021The monthly Pournami Garuda Seva coupled with the auspicious Guru Poornima witnessed the enchanting Garuda Vahana Seva on Saturday evening at Tirumala.

Sri Malayappa Swamy, in all His religious splendour, took out a celestial ride on Garuda Vahanam along four Mada streets between 7 pm and 8 pm to bless His devotees.

 Addl EO Sri AV Dharma Reddy and others took part.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమ‌ల‌లో వైభ‌వంగా పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

తిరుమల, 2021 జులై 24: తిరుమల శ్రీవారి ఆలయంలో శ‌నివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జరిగింది. గురుపౌర్ణ‌మి సంద‌ర్భంగా రాత్రి 7 నుండి 8 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగాధగా మెరిసిపోతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.