ANKURARPANA FOR SKVST BRAHMOTSAVAMS ON FEBRUARY 17 _ ఫిబ్రవరి 17న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
Tirupati, 15 February 2025: The annual Brahmotsavam in Srinivasa Mangapuram will commence on February 18 with Ankurarpanam on February 17.
On this occasion, Mritsangrahanam, Senadhipati Utsavam and Ankurarpanam programs will be conducted from 6 pm to 8 pm on Monday.
Dhwajarohanam will be held in Meena lagnam on February 18 between 8.15 am and 8.40 am for the Brahmotsavam of Sri Kalyana Venkateswara Swamy. Before that, Trichy Utsavam will be performed. Peddashesha Vahanaseva will be held on the same evening between 7p. to 8 pm.
Every day the morning Vahana Sevas will be between 8 am and 9 am and evening sevas between 7pm and 8 pm.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఫిబ్రవరి 17న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి, 2025 ఫిబ్రవరి 15: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 17న అంకురార్పణ జరుగనుంది. ఆలయంలో ఫిబ్రవరి 18 నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ఈ సందర్భంగా సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 18న ధ్వజారోహణం
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 18న ఉదయం 8.15 నుండి 8.40 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. అంతకుముందు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగనుంది.
బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఉదయం 8 గం.ల నుండి 9 గం.ల వరకు, రాత్రి 7 – 8 గం.ల వరకు స్వామివారు వాహన సేవలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.