ANKURARPANA HELD _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

TIRUPATI, 07 SEPTEMBER 2022: The Ankurarpana for annual Pavitrotsavams in Sri Padmavathi Ammavaru temple at Tiruchanoor was held on Wednesday evening.

 

This festival will be observed from September 8 to 10.

 

Devotees shall participate in the Pavitrotsavams on all days on payment of Rs. 750 per person.

 

JEO Sri Veerabrahmam, Temple DyEO Sri Lokanatham, AEO Sri Prabhakar Reddy, religious staff and others were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుప‌తి, 2022 సెప్టెంబ‌రు 07: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు బుధ‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వ‌హించారు. ఆలయంలో సెప్టెంబరు 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్ర‌హణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం, ప‌విత్ర అధివశం నిర్వ‌హించారు. ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా సెప్టెంబరు 8వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 9న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 10న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు. భ‌క్తులు ఒక్కొక్క‌రు రూ.750/- చెల్లించి ఒక‌రోజు ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో జేఈవో శ్రీ వీర బ్రహ్మం ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అగ‌మ స‌ల‌హాదారు శ్రీ శ్రీ‌నివాసాచార్యులు, అర్చ‌కులు శ్రీ బాబుస్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ దామోద‌రం త‌దిత‌రులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.