ANKURARPANA IN KRT _ జూలై 23 న శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ
TIRUPATI, 22 JULY 2022: As part of annual Pavitrotsavams in Sri Kodanda Ramalayam in Tirupati, Ankurarpana will be observed on Saturday evening.
Pavitrotsavams will be observed between July 24 to 26.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUMALA
జూలై 23 న శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలకు జూలై 23 వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వహించనున్నారు జూలై 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి
యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రాకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.
పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటిరోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, రెండో రోజు పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ప్రతిరోజూ ఉదయం స్నపనతిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, చివరిరోజు ఒక పవిత్రం బహుమానంగా అందజేస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.