ON-LINE QUOTA OF SENIOR CITIZENS ON JULY 23 _ జులై 23న ఆన్‌లైన్‌లో వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత ప్ర‌త్యేక ద‌ర్శ‌నం కోటా విడుద‌ల

Tirumala, 22 July 2022: The on-line quota of Physically Handicapped and Senior citizens for the month of August-2022 will be released July 23 at 9am by TTD.

Everyday 1000 tokens are allotted. The devotees falling under this category are requested to make note of this avail the opportunity by book these tokens in on-line.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUMALA

జులై 23న ఆన్‌లైన్‌లో వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత ప్ర‌త్యేక ద‌ర్శ‌నం కోటా విడుద‌ల

తిరుమల, 2022 జులై 22: వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను జులై 23వ తేదీన ఉద‌యం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

రోజుకు వెయ్యి టోకెన్ల చొప్పున జారీ చేస్తారు. ఈ టోకెన్లు బుక్ చేసుకున్న వారిని మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స్లాట్‌లో ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ఆన్‌లైన్‌లో ఉచిత ద‌ర్శ‌న టోకెన్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైనది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.