ANKURARPANAM FOR BRAHMOTSAVAMS ON SEP 12_ సెప్టెంబర్‌ 12న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Tirumala, 11 September 2018: The festival of perlude to annual Brahmotsavams, Ankurarpanam will be performed on Wednesday evening in Tirumala temple.

Also known as Beejavapanam, this Deed Sowing Festival marks the conduct of the mega religious nine day event in a successful manier.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సెప్టెంబర్‌ 12న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

సెప్టెంబరు 11, తిరుమల 2018: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్‌ 13 నుంచి 21వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం సెప్టెంబర్‌ 12వ తేదీ బుధవారం రాత్రి 7 నుంచి 8 గంటల నడుమ సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ నిర్వహిస్తారు.

వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. వైఖానస ఆగమాన్ని పాటించే తిరుమల మరియు ఇతర ఆలయాల్లో ఉత్సవాలకు ఒక రోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీ. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అదేరోజు రాత్రి బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో అంకురార్పణం (బీజవాపనం) జరుగుతుంది. అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు.

సెప్టెంబర్‌ 13న ధ్వజారోహణం :

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సెప్టెంబర్‌ 13వ తేదీ గురువారం సాయంత్రం 4 నుండి 4.45 గంటల మధ్య మకర లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఆ తరువాత రాత్రి 8 నుండి 10 గంటల వరకు పెద్దశేషవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

వార్షిక బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం(9గం|| నుండి 11 గం|| వరకు) రాత్రి(8 గం|| నుండి 10 గం||ల వరకు)

13-09-2018 సా|| ధ్వజారోహణం (4 నుంచి 4.45 గం||ల వరకు)(మకర లగ్నం), పెద్దశేషవాహనం.

14-09-2018 చిన్నశేష వాహనం హంస వాహనం

15-09-2018 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

16-09-2018 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

17-09-2018 మోహినీ అవతారం గరుడ వాహనం(రా.7 నుండి 12 వరకు)

18-09-2018 హనుమంత వాహనం స్వర్ణరథం (సా.4 నుండి 6 వరకు), గజవాహనం.

19-09-2018 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

20-09-2018 రథోత్సవం(ఉ.7.30 గంటలకు) అశ్వ వాహనం

21-09-2018 చక్రస్నానం(ఉ.7.30 నుండి 10 వరకు) ధ్వజావరోహణం(రా|| 7 నుంచి 9 వరకు)

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.