REVIEW MEETING HELD_ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై తిరుమల జెఇఓ సమీక్ష
Tirumala, 11 September 2018: The review meeting by Tirumala JEO Sri KS Sreenivasa Raju on the visit of Honourable CM of AP Sri N Chandrababu Naidu and Brahmotsavams arrangements was held at Annamaiah Bhavan in Tirumala on Tuesday.
The JEO directed the officials to be in the allotted duty points during the visit of CM.
Later he reviewed department wise arrangements for annual festival.
He said, CE Sri Chandrasekhar Reddy and FACAO Sri Balaji have been deployed overall supervisory duties for brahmotsavams and allotted supervision to EEs to inspect every mada street.
CVSO Incharge Sri Siva kumar Reddy, All HoDs were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై తిరుమల జెఇఓ సమీక్ష
తిరుమల, 2018 సెప్టెంబరు 11: రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ.. శ్రీ నారా చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టిటిడి తిరుమల జెఇఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు మంగళవారం సాయంత్రం తిరుమల లోని అన్నమయ్య భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఇఓ మట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు సెప్టెంబరు 13న సాయంత్రం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. టిటిడి అధికారులు తమకు విధులు కేటాయించిన ప్రాంతంలో అప్రమత్తంగా ఉండి గౌ..ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం విభాగాల వారీగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సమీక్షించారు. టిటిడి ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి మొత్తం ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని, మాడ వీధుల్లో పర్యవేక్షణకు ఇఇలకు విధులు కేటాయిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో ఇన్ చార్జి సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.