ANKURARPANAM FOR VASANTHOTSAVAMS HELD AT TIRUCHANOOR TEMPLE _ శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణ

Tiruchanoor, 24 May 2021: TTD organised Ankurarpanam fete for the annual Vasantothsavams of Sri Padmavati Ammavaru Temple in Ekantam as per COVID-19 guidelines on Monday evening.

Earlier in the morning Sahasra Namarchana and Nityarchana were performed and in the evening Punyahavachanam, Raksha Bandhanam and Ankurarpanam were conducted. 

As part of festivities of Vasantothsavams from May 25 – 27, TTD will organise Snapana Tirumanjanam for the utsava idols everyday afternoon and the procession of Goddess Sri Padmavati inside temple in the evening.

As a result of Covid guidelines, TTD is organising Tiruchi utsavam instead of Swarna Rathotsavam on May 26.

Temple DyEO Smt Kasturi Bai, AEO Sri Prabhakar Reddy, Superintendent Smt Malleswari, Temple inspector Sri Rajesh and other staffs were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణ

తిరుపతి, 2021 మే 24: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. కోవిడ్‌-19 వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా వ‌సంతోత్స‌వాల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. సాయంత్రం 6.00 గంటల నుండి పుణ్యహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ చేపట్టారు. ఈ సందర్భంగా శుక్రవారంపుతోటలో పుట్టమన్ను సేకరించారు.

మే 25 నుండి 27వ తేదీ వ‌ర‌కు మూడు రోజులపాటు మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు ఆల‌యంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వ‌హిస్తారు. రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు ఆల‌య ప్రాంగ‌ణంలో అమ్మ‌వారిని ఊరేగిస్తారు. ఈ కార‌ణంగా మే 26న స్వ‌ర్ణ‌ర‌థోత్స‌వానికి బ‌దులుగా తిరుచ్చి ఉత్స‌వం జ‌రుగ‌నుంది.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి క‌స్తూరిబాయి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీమ‌తి మ‌ల్లీశ్వ‌రి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్‌, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.