ANKURARPANAM HELD FOR AYODHYA KANDA PARAYANAM DIKSHA _ అయోధ్య కాండ పారాయణ దీక్ష‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణ

Tirumala 20, October, 2021: As part of TTD spiritual agenda to protect humanity from pandemic Corona, TTD conducted Ankurarpanam fete on Wednesday at Dharmagiri Veda vijnan peetham for the Ayodhyakanda parayanam Diksha scheduled to begin from October 21November 16.

During the period the Principal of Dharmagiri Veda vijnan peetham Sri KSS Avadhani will lead the shloka parayanam by 16 Vedic pundits at Vasantha Mandapam, while another batch of 16 pundits will perform the japa, Tarpana and Homa programs at the Dharmagiri Veda vijnan peetham.

On, Thursday October 21 Vedic pundits will commence parayanam of 291 shlokas of Ayodhyakanda at 08.00 am and the SVBC shall give live telecast of the proceedings from 08.30 am daily.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

అయోధ్య కాండ పారాయణ దీక్ష‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుమ‌ల‌, 2021 అక్టోబ‌రు 20: లోక సంక్షేమం కోసం, క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌లో అక్టోబ‌రు 21 నుండి న‌వంబ‌రు 16వ తేదీ వ‌ర‌కు 27 రోజుల పాటు జరుగనున్న అయోధ్యకాండ పారాయణ దీక్షకు బుధవారం రాత్రి ధర్మగిరి శ్రీ వేంకటేశ్వర వేద విఙ్ఞాన పీఠంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ జ‌రిగింది. ఇందులో భాగంగా సంక‌ల్పం, విష్వ‌క్సేన పూజ‌, పుణ్యాహ‌వ‌చ‌‌నం, రుత్విక్‌వ‌ర‌ణం, కంక‌ణధార‌ణ‌, అగ్నిప్ర‌తిష్ట‌, అంకురార్ప‌ణ నిర్వ‌హించారు.

తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని ఆధ్వ‌ర్యంలో వసంత మండపంలో 16 మంది వేద పండితులతో శ్లోక పారాయ‌ణం, మరో 16 మంది వేద పండితులతో ధ‌‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠంలో జ‌ప‌, త‌ర్ప‌ణ, హోమాది కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

వసంత మండపంలో అక్టోబరు 21న గురువారం ఉదయం 8 గంటలకు శ్లోక పారాయ‌ణం ప్రారంభమవుతుంది. మొదటి రోజు 291 శ్లోకాలు పారాయణం చేస్తారు. ప్రతిరోజూ ఉదయం 8:30 నుండి 10 గంటల వరకు ఎస్వీబీసీ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారిచే విడుద‌ల చేయ‌బ‌డిన‌ది.