POURNAMI GARUDA SEVA HELD _ తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ

Tirumala, 20 Oct. 21: On Wednesday night TTD organised the monthly Pournami Garuda Seva.

Richly decorated and bejewelled utsava idol of Sri Malayappa was paraded on Mada streets from 7.00pm- 9.00 pm and blessed the devotees.

Legends say that Darshan of Sri Malayappa on his favourite vehicle of Garuda Vahana would beget devotees all boons and relief from all ailments.

Temple DyEO Sri Ramesh Babu, VGO Sri Bali Reddy and others took part.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ
 
అక్టోబరు 20, తిరుమల 2021: తిరుమలలో బుధవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ జరిగింది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టిటిడి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.
 
గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం
 
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ, శ్రీవారి బ్రహ్మోత్సవాలలోనూ గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం, విశిష్టత ఏర్పడ్డాయి.
 
ఈ కార్యక్రమంలో  ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ రమేష్ బాబు, విజివో శ్రీ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.