ANKURARPANAM HELD FOR VONTIMITTA ANNUAL BRAHMOTSAVAMS _ శాస్త్రోక్తంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
Vontimitta, 20 April 2021: Akurarpanam or Beejavapanam, the Seed sowing ritual was held in Sri Kodandaramaswamy temple at Vontimetta in YSR Kadapa district on Tuesday ahead of annual Brahmotsavams which will be observed in ekantham as per Covid guidelines.
After morning Suprabatha Seva and Abhisekam for Parivara Devatas, Diksha Abhisekam was performed for Mula Virat and later in the evening, Ankurarpanam was conducted amidst Mangala Vaidyam and Veda mantras.
Temple DyEO Sri Ramesh Babu, AEO Sri Muralidhar, Superintendents Sri Venkatachalapathi, Sri Venkatesayya, Temple Inspector Sri Dhananjeyalu, Kankana bhattar Sri Rakesh Kumar and others were present.
DWAJAROHANAM ON APRIL 21:
The annual Brahmotsavams at Vontimetta Sri Kodandaramaswamy temple will commence on April 21 with the Dwajarohanam between 9.15am and 10.15am in the auspicious Mithuna lagnam.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శాస్త్రోక్తంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
ఒంటిమిట్ట, 2021 ఏప్రిల్ 20: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 21 నుంచి 29వ తేదీ వరకు ఏకాంతంగా జరుగనున్న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.
ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, పరివార దేవతలకు అభిషేకం నిర్వహించారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు మూలవర్లకు దీక్ష తిరుమంజనం చేశారు. సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు అర్చకులు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, ఏఈవో శ్రీ మురళీధర్, సూపరింటెండెంట్లు శ్రీ వెంకటాచలపతి, శ్రీ వెంకటేశయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనంజయులు, కంకణబట్టార్ శ్రీ రాజేష్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 21న ధ్వజారోహణం :
ఏప్రిల్ 21న ధ్వజారోహణంతో ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.15 నుండి 10.15 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.